బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఓట్లు నమోదు చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే : సిపిఐ(యం)

3 గంటల క్రితం

The responsibility of registering votes lies with the Election Commission: CPI(M)
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 01:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : ఓట్లు నమోదు చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనని, ఏ ఒక్కరి ఓటు గల్లంతు కాకుండా కాపాడాలని సిపిఐ(యం) డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి బుధవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల సంఘం నోటీసులు అందించిన లక్షలాది మంది ఓటర్ల ఇంటింటికి సిబ్బందిని పంపి అందరి ఓటర్ల వివరాలు సేకరించి వాటిని నమోదు చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం తీసుకోవాలని, ఇందుకోసం ఫిర్యాదుల స్వీకరణకు గడువు నెలాఖరు వరకు పెంచాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నదన్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పేరుతో రాష్ట్రంలో లక్షలాదిమంది అర్హులైన ఓటర్లను కుంటి సాకులతో తొలగించడం సరికాదన్నారు. మరొక పది రోజులపాటు అభ్యంతరాలు, నమోదుకు గడువు పెంచడం మంచిదే కానీ అది చాలదు అని చెప్పారు. దాన్ని నెలాఖరు వరకు పొడిగించాలి.. కానీ లక్షలాది మందిని కార్యాలయాలకు విచారణ పేరుతో పిలిపించడం తగదు అని అన్నారు. సిబ్బంది సంఖ్యను పెంచి, ఇంటింటికి తిరిగి అర్హులైన ప్రతి ఒక్కరికి వద్ద ఉన్న పత్రాల ఆధారంగా అందరి ఓటర్లను నమోదు చేసి, తుది జాబితాలో వారి పేర్లు ఉండే విధంగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలన్నారు. పరిశీలన సందర్భంలో పత్రాలు లేవనే కారణాలతో ఓట్లను తొలగించే చర్యలు తీసుకోవద్దు అని సూచించారు. చిన్న చిన్న తప్పులను సిబ్బంది సరి దిద్దాలన్నారు. అవసరమైన సందర్భాలలో మళ్ళీ పరిశీలన చేసి అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు నిలబడే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నదని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
cpim




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్