న్యూఢిల్లీ : నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారంలో విద్యా వ్యవస్థ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ... ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష శనివారంతో 21వ రోజుకు చేరింది. అయితే ఈరోజు ఉదయం ఢిల్లీ పోలీసులు ఆయనను బలవంతంగా అదుపులోకి తీసుకుని, అక్కడి నుండి ఆసుపత్రికి తరలించారు. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ సిపిఐ(ఎం) సీనియర్ నాయకురాలు బృందాకారత్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దనున్న దీక్షా శిబిరాన్ని సందర్శించారు. నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులు, యువతకు ఆమె మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం కొనసాగుతున్న విద్యార్థి-యువజన పోరాటానికి, సోనమ్ వాంగ్‌చుక్‌కు బృందా కారత్ తన పూర్తి సంఘీభావాన్ని తెలియజేశారు.
విద్యార్థి ఉద్యమానికి బృందా కారత్ సంఘీభావం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 18, 2026, 01:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)