mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionచెట్టుకెలా తెలుసో?

31 మే, 2026

tree
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 01, 2026, 04:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

మళ్ళీ వస్తానని చెట్టుకెలా తెలుసో?
విడిచిన చోటే, కాచుక్కూచుంటుంది!
వెంటనే పోనివ్వదీనూ,
కాసేపైనా గొడుగు కాచి,
చెమటారబెడుతుంది చిగురుటాకులతో.
తలలను నిమిరి,
పెద్దరికాన్నీ నిలబెట్టుకుంటుంది.

కొమ్మకు ఆనించిన తలకు
కాసేపైనా కునుకు పట్టిస్తుంది.
రెమ్మన వాలిన పిట్టకు
కూసింతైనా పాడమంటుంది.
కొమ్మ చెక్కిళ్ళపై గుర్తులు
అమ్మ పాడిన జోలపాటను,
నాన్న ఎత్తిన నాగలి మోతను
కళ్ళకు చెమ్మను చేయిస్తాయి.

ఉత్తి చేతులతో పంపడం మనసొప్పుకోదేమో!
ఆకో-అలమో, కాయో-పసరో,
వెన్నంటే పెట్టుకుంటుంది.
పోతూ పోతుంటే, చూపుమేర తలాడిస్తూ
వీడ్కోలూ పలుకుతుంది.

బహుశా…
అందరి కంటే ఎక్కువ ఈ చెట్లకే తెలుస్తాయేమో!
ఈ భూమ్మీద, ఒకరి కోసం ఒకరమని!

(జూన్ 5 : ప్రపంచ పర్యావరణ దినోత్సవం)
– వినోద్‌ కుత్తుం 96343 14502

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్