నీ తరం కాదు, ఈ తరాన్ని ఆపడం
కుర్రాళ్లు కాదు వాళ్లు ఆటమ్ బాంబులు
మహా అయితే నీకు వందేళ్లు
తర్వాత నీ శిలావిగ్రహంపై
పక్షులు కూడా రెట్టలు వేస్తాయి
నీ మొహానికి తెల్ల రంగు పూస్తాయి
నువ్వు తెల్ల మొహం వేయడం ఖాయం
మిస్టర్ విశ్వగురు...!
ప్రశ్నిస్తే నేరమా?
ఈ సమాజంలో
అనేకమంది ప్రశ్నలు వేయలేదా?
ఆ పండు కింద ఎందుకు పడిందన్న ప్రశ్న కదా
రాకెట్‌ను ఆకాశంలోకి ఎగచిమ్మింది!
ఆ ప్రశ్నే నీ శరీరంలోని
ప్రతి భాగాన్ని బయట పెట్టింది ఎక్స్‌రేలో
రాజధాని వీధుల్లో పోగైన బొద్దింకలు
చలి చీమలు చంపిన కొండచిలువను గుర్తుచేస్తున్నాయి
మరుగున పడ్డ మా బలాన్ని గుర్తుచేస్తున్నాయి!
- చలపతి








కామెంట్‌లు (0)