ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

బడి కడుపులో కత్తులు!

1 గంట క్రితం

child
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 11:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మీ చేతిలో అక్షరాలు పూలై

పూయాల్సిందిపోయి

కత్తుల కవాతా!

అమ్మో..

విపత్తులో పడింది చదువులమ్మ!

కలం అందుకోవలసిన చేతులు

కత్తులందుకోవడం జాతికే విపత్తు

నివ్వెరపోతుంది దేశం యావత్తు

క్రమశిక్షణకు మీరిచ్చిన బహుమతి

కడుపునిండా కత్తులు

ఎంత వేగం మరిచిపోయారు

మీరూ అమ్మల కడుపులో పడిన విత్తులు

ఇప్పుడు నాకు

బడికి వెళ్లడానికి భయమేస్తుంది

ఎటు పోతుంది బాల్యం

వ్యవస్థ చేసుకోవాలి పునరావలోకనం!

​(దుర్వ్యసనాలకు గురైన ఇద్దరు పదో తరగతి విద్యార్థులను మంచిగా ఉండాలని మందలించినందుకు ప్రిన్సిపాల్‌పై కక్షగట్టి దారుణంగా చంపిన సంఘటన చూసి)

​- డా. సారిపల్లి నాగరాజు, 80083 70326

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్