మార్పు కోరే తరం కన్నెర్ర చేస్తున్నది
పిడికిలెత్తి నినదిస్తున్నది!
రహస్యోద్యమాలకు చెల్లు చీటి
కుట్రలన్నీ ఇకపై బట్టబయలు
చలో జంతర్‌మంతర్
తప్పు ఎవరు చేసినా తప్పుకోవలసిందే!
వాదనలు లేవు, వివాదాలు లేవు
సమయం అంతకంటే లేదు
నేరం చేసావా లేదా... ఒకటే నిలదీత
దిగిపో... దిగిపో...!
ఇన్నాళ్లకు ముందు తరం దూతలు
మరో ప్రపంచాన్ని కలగంటున్నారు
కళ్ల ముందు జరుగుతున్న
కనికట్లను విప్పేస్తున్నారు!
లాఠీలు విరిగినా, రాళ్లు విసిరినా
గాయాలు మోస్తూనే
చేస్తున్న నినాదం... బోలో వందేమాతరం!
- కోట్ల వెంకటేశ్వర రెడ్డి
94402 33261








కామెంట్లు (0)