బుధవారం, 28 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసమయం ‌లేదు.. చురుగ్గా పనిచేయాలి

5 గంటల క్రితం

cm.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026, 10:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి నేతలతో చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికలకు తక్కువ సమయమే ఉందని, ఈ వారం పాటు చురుగ్గా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కూటమి పార్టీలు టిడిపి, జనసేన, బిజెపిలకు చెందిన 45 వేల మంది లీడర్లు, కార్యకర్తలతో బుధవారం టెలీకాన్ఫరెన్స్‌ ‌నిర్వహించి మాట్లాడారు. ఇప్పుడు డబుల్‌ ఇంజిన్‌ ‌సర్కారులో ఉన్నామని, ట్రిపుల్‌ ఇంజిన్‌ ‌సర్కార్‌ ‌రావాలని చెప్పారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, ఎంపిటిసిలు, జెడ్‌‌పిలు అన్నీ గెలవాలన్నారు. మూడు పార్టీల కార్యకర్తలు సార్వత్రిక ఎన్నికల్లో ఒకే మాట-ఒకే బాట అన్నట్టుగా పని చేశారన్నారు. ఈ ఎన్నికల్లోనూ ఒకే జట్టు అన్నట్టు ఉండాలన్నారు. ఎన్నికల సమయంలో ఒక పార్టీలోనే అనేక ఇబ్బందులు ఉంటాయని, అలాంటిది కూటమిలో మూడు పార్టీలు ఉన్నప్పుడు సమస్యలు ఉంటాయన్నారు. పార్టీల అధినేతలంతా కూర్చొని సీట్లపై స్పష్టత ఇచ్చామని, సీట్ల కేటాయింపులు జరిపామని పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగా కూటమి కార్యకర్తలు పని చేయాలని సూచించారు. ఇప్పుడు సీట్లు రాని వారికి నామినేటెడ్, ఛైర్మన్ పదవుల ద్వారా అవకాశం కల్పిస్తామని తెలిపారు. కూటమి నిర్ణయించిన అభ్యర్థులకే మద్దతు తెలిపి వారి విజయానికి కృషి చేయాలన్నారు. రెబల్స్, స్వతంత్రులుగా పోటీలో ఉండటానికి వీల్లేదన్నారు. ఎన్నికలను అడ్డుకునేందుకు వైసిపి 62 పిటిషన్లు వేసి సుప్రీంకోర్టు వరకూ వెళ్లిందని తెలిపారు. ఆ పార్టీ అధినేత ఆస్తులు కూడబెట్టుకునే పనిలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. వైసిపి ఓటు బ్యాంక్ ఇప్పటికే తగ్గిపోయిందని, రాష్ట్రం బాగు కోసం మరింత తగ్గాలని అన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్