ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అన్నమయ్య జిల్లా మొలకలచెరువు, పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో దౌర్జన్యాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం కొరడా ఝులిపించింది. సిఐ కె దస్తగిరి, ఎస్ఐ పి రామకృష్ణ, మహిళా ఎస్‌ఐ ప్రియాంకను విధుల నుంచి తొలగించాలని ఆదేశించింది. మొలకలచెరువులో స్థానిక సిఐ దస్తగిరి, ఎస్‌ఐ రామకృష్ణ నామినేషన్ల ప్రక్రియకు ఆటంకం కలిగించినట్లు సంబంధిత అధికారులు నివేదించారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా.. సిఐ, ఎస్ఐను ఎన్నికల విధులతో పాటు సాధారణ విధుల్లోంచి కూడా వెంటనే రిలీవ్ చేయాలని ఆదేశించారు. అలాగే పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి, వైసిపి నేత విడదల రజినిని పోలీసులు నెట్టేసి కింద పడేసిన ఘటనపై ఎస్‌ఇసి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో చిలకలూరిపేట రూరల్ ఎస్‌ఐ ప్రియాంకపై విచారణకు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు ఆమెను ఎన్నికల విధులతో పాటు అన్ని విధుల నుంచి తప్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
Print Editionసిఐ, ఇద్దరు ఎస్‌ఐలపై వేటు
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 25, 2026, 12:34 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)