ప్రజాశక్తి - యంత్రాంగం : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, డివిజన్లు, పరిషత్ స్థానాల్లో సిపిఎం అభ్యర్థులు బుధవారం ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. స్థానిక సమస్యలు, మౌలిక వసతుల కల్పన, పేదల ఇళ్లకు పట్టాలు, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా ప్రజల్లోకి వెళ్తున్నారు. వర్షంలోనూ ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మమేకమవుతూ తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
కర్నూలు జిల్లా మేయర్ అభ్యర్థి బి శ్యామల.. ఆరో వార్డు కార్పొరేటర్ అభ్యర్థి రవితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నెల్లూరు 37వ డివిజన్ అభ్యర్థి షేక్ రఫీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
అనంతపురం కార్పొరేషన్ పరిధిలో 25, 60, 62వ వార్డుల్లో అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహించారు. గుంతకల్లు, గుత్తి, కదిరి పట్టణంలోని ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు.
ఏలూరులోని 34వ డివిజన్ అభ్యర్థి ఎర్ర రాంబాబు జోరువానలోనూ ప్రచారం నిర్వహించారు. ఏలూరు జిల్లా బుట్టాగూడెం జెడ్‌పిటిసి అభ్యర్థి తెల్లం నాగమణి ప్రచారం చేశారు.
ఎచ్చెర్ల జెడ్‌పిటిసి అభ్యర్థి పొందూరు చంద్రరావు, చిలకపాలెం ఎంపిటిసి అభ్యర్థి తోనంగి నందోడు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. భోరున కురుస్తున్న వర్షంలోనూ నాయకులు, కార్యకర్తలు కరపత్రాలు పంచుతూ ‘సుత్తి, కొడవలి, నక్షత్రం’ గుర్తుపై ఓటు వేయాలని కోరుతూ ప్రచారం కొనసాగించారు. టెక్కలి ఒకటి, ఎనిమిదోవ ప్రాదేశిక అభ్యర్థులు నంబూరు షణ్ముఖరావు, కిల్లాన డేనియల్‌తో కలిసి జెడ్‌పిటిసి అభ్యర్థి కొల్లి ఎల్లయ్య ప్రచారం నిర్వహించారు. నందిగాం మండలం హరిదాసుపురం ఎంపిటిసి అభ్యర్థి పాలిన సాంబమూర్తి, మందస మండలం సారంగిపురంలో సిపిఎం జెడ్‌పిటిసి అభ్యర్థి రుష్యశృంగ బినిత కుమారి ప్రచారం చేశారు.









కామెంట్‌లు (0)