శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition​ప్రజల్లోకి సిపిఎం.. విస్తృతంగా ప్రచారం

1 గంట క్రితం

​ప్రజల్లోకి సిపిఎం.. విస్తృతంగా ప్రచారం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 11:38 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - యంత్రాంగం : రాష్ట్రంలో మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో శుక్రవారం సిపిఎం అభ్యర్థుల ఎన్నికల ప్రచారం విస్తృతంగా కొనసాగింది. పలు జిల్లాల్లోని వివిధ డివిజన్లు, వార్డుల్లో అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ప్రతి ఒక్కరు తమ అమూల్యమైన ఓటును సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సమస్యల పరిష్కారం, వార్డుల అభివృద్ధికి కృషి చేస్తామని వివరిస్తూ ప్రచారం సాగించారు.

అనంతపురం కార్పొరేషన్‌‌లో 25వ డివిజన్‌ అభ్యర్థి సాకే సరస్వతి, 60 డివిజన్‌ అభ్యర్థి సి గీత, 62వ డివిజన్‌ అభ్యర్థి ఎ గుల్జార్‌‌లు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని 39వ వార్డులో పోటీ చేస్తున్న ముస్తక్‌ ఆలీ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆయనకు మద్దతుగా సిపిఎం రాష్ర్ట నాయకులు జి ఓబులు ప్రచారంలో పాల్గొన్నారు.

నెల్లూరు కార్పొరేషన్ 37వ డివిజన్ సిపిఎం కార్పొరేటర్ అభ్యర్థి షేక్ రఫీ, 29వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పోతురాజు శ్రీనివాసులు, 35వ డివిజన్ సిపిఎం అభ్యర్థి వీర్ల శ్రీనివాసులు, 33వ డివిజన్ అభ్యర్థి సాహిత్య ప్రపూర్ణ, 24వ డివిజన్‌ అభ్యర్థి కంభంపాటి హేమలత, 72వ డివిజన్ అభ్యర్థి గజ్జి పరమేశ్వరి, 21వ డివిజన్ అభ్యర్థి బూచి దీప్తి, 20వ డివిజన్ అభ్యర్థి కొప్పోలు వెంకటరమణారెడ్డి ప్రచారం సాగించారు.

ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ 59వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి గంధవల్ల బాలకృష్ణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

​ఏలూరు జిల్లా ఏలూరు కార్పొరేషన్‌‌లో వైసిపి బలపర్చిన 34వ డివిజన్ సిపిఎం కార్పొరేటర్‌ అభ్యర్థి కార్మిక నేత యర్రా రాంబాబు ఇంటింటి ప్రచారం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో 23, 25 వార్డుల్లో సిపిఎం అభ్యర్థులు సందక ఉదయకుమారి, బివి వర్మ విస్తృత ప్రచారం సాగించారు.

గ్రేటర్‌ ‌విశాఖ మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ జివిఎంసి 77వ వార్డు, కార్పొరేటర్‌ అభ్యర్థి రేగులవలస విమల, 98వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ఎం రాంబాబు, 96వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి డి రమణ, రెండో వార్డు కార్పొరేటర్‌ అభ్యర్థి ఆర్‌ఎస్‌ఎన్‌ మూర్తి సత్యనారాయణ, 64వ వార్డులో కార్పొరేటర్‌ అభ్యర్థి గెల్లా పావని ప్రసన్న, 16వ వార్డు అభ్యర్ధి శీరెడ్డి రంగమ్మ‌, ​13వ వార్డులో బరిలో ఉన్న సంగిరెడ్డి గౌరి, 115వ వార్డు అభ్యర్థి బలివాడ వెంకటరావు, 45వ వార్డు అభ్యర్థి బిఎల్‌ నారాయణ, 66వ వార్డు అభ్యర్థి బొట్టా ఈశ్వరమ్మ.. తమను గెలిపించాలని ప్రచారం జోరుగా కొనసాగించారు.

​​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్