మున్సిపల్, కార్పొరేషన్ అభ్యర్థుల అభ్యర్ధన
ప్రజాశక్తి - యంత్రాంగం :మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా సిపిఎం అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ఇంటింటి ప్రచారాలు, ర్యాలీలు నిర్వహించి ఓటర్ల మద్దతు కోరారు. పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు ప్రచారంలో పాల్గొంటూ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నారు.
అనంతపురం, గుత్తి, గుంతకల్లు, శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని కదిరిలో అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. కదిరిలో నిర్వహించిన ప్రచారంలో సిపిఎం రాష్ర్ట నాయకుడు ఓబులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లాలో నగర మేయర్ అభ్యర్థి బైటి శ్యామల, 43వ వార్డు అభ్యర్థి జె. కృష్ణవేణి, 44వ వార్డు స్వతంత్ర అభ్యర్థి మీసాల దేవకుమారితో కలిసి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె ప్రభాకర్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. 59వ వార్డు అభ్యర్థి ఎం కుమారి, 23వ వార్డు అభ్యర్థి ఎం రామాంజనేయులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
తూర్పు గోదావరి జిల్లా 20వ వార్డు అభ్యర్థి దగ్గు అశోక్ కుమార్, నిడదవోలులో ఆరోవ వార్డు అభ్యర్థి జువ్వల రాంబాబులను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావు ప్రచారం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా 17వ వార్డులో అభ్యర్థి సఖిలే సూర్యనారాయణ తరఫున రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు ప్రచారం నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి-3 ఎంపిటిసి స్థానంలోని టేకుమూడి ఈశ్వరరావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లంకుర్రు ఎంపిటిసి-1 స్థానంలోని విప్పర్తి మోహనరావు, తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం త్యాజంపూడి స్థానంలోని అయినవర్తి శ్రీనివాసరావు విస్తృత ప్రచారం చేశారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి జెడ్‌పిటిసి అభ్యర్థి కొల్లి ఎల్లయ్య, టెక్కలి- 8 ఎంపిటిసి అభ్యర్థి కె డేనియల్, టెక్కలి- ఎంపిటిసి అభ్యర్థి నంబూరు షణ్మఖరావు, ఎంపిటిసి అభ్యర్థి కమలమ్మ, ఎచ్చెర్ల_జెడ్‌పిటిసి పొందూరు చంద్రరావు, చిలకపాలెం ఎంపిటిసి దోనంగి నందోడు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు.
విజయనగరం జిల్లా మున్సిపల్ పరిధిలో 2వ వార్డు అభ్యర్థి సంచాన ఉమామహేశ్వరరావు, 3వ వార్డు అభ్యర్థి గుణుపూరు కృష్ణలను గెలిపించాలని కోరుతూ నిర్వహించిన భారీ ర్యాలీలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె సుబ్బరావమ్మ పాల్గొన్నారు. మెంటాడ మండలంలో జెడ్‌పిటిసి అభ్యర్థి సిరగం శాంతి, గుర్లతమ్మిరాజుపేట ఎంపిటిసి అభ్యర్థి గేదెల పెదరాము, లోతుగెడ్డ ఎంపిటిసి అభ్యర్థి రాకోటి రాములు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేపట్టారు.
నెల్లూరు జిల్లా 37 డివిజన్ సిపిఎం కార్పొరేటర్ అభ్యర్థి షేక్ రఫీకి మద్దతుగా మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఏలూరు కార్పొరేషన్ 34వ డివిజన్ అభ్యర్థి యర్రా రాంబాబు, 18వ వార్డు అభ్యర్థి జి సుజాత ప్రచారం నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో 23, 25వ వార్డు అభ్యర్థులు సందక ఉదయకుమారి, బివి.వర్మ, 24వ వార్డు అభ్యర్థి ఏనుగేటి రమణ ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు.
పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర జెడ్‌పిటిసి అభ్యర్థి కేతా గోపాలన్, పాలకోడేరు జెడ్‌పిటిసి అభ్యర్థి శేషపు అశ్రియ్య వేండ్ర, ఏలూరు జిల్లా బుట్టాయగూడెం జెడ్‌పిటిసి అభ్యర్థి తెల్లం నాగమణి తమను గెలిపించాలని ప్రచారంలో కోరారు.
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసి)లో పోటీ చేస్తున్న 66వ వార్డు అభ్యర్థి బొట్టా ఈశ్వరమ్మ, 64వ వార్డు అభ్యర్థి గెల్ల పావని ప్రసన్న, 65వ వార్డు అభ్యర్థి పెండ్ర జ్యోతి, 77వ వార్డు అభ్యర్థి రేగులవలస విమల ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రెండవ వార్డులో ఆర్‌ఎస్‌ఎన్.మూర్తి, 13వ వార్డులో ఎస్ గౌరి, 16వ వార్డులో ఎస్ రంగమ్మ, 96వ వార్డు అభ్యర్థి డి రమణ, 115వ వార్డు అభ్యర్ధి బలివాడ వెంకటరావు ప్రచారం చేశారు. అనకాపల్లి జిల్లాలో జెడ్‌పిటిసి అభ్యర్థి కాళ్ల తేలయ్యబాబు, మునగపాక మండలంలోని వాడ్రాపల్లి ఎంపిటిసి అభ్యర్థి ఎస్ బ్రహ్మాజీ, పోలవరం జిల్లా మారేడుమిల్లి జెడ్‌పిటిసి అభ్యర్థి మట్ల వాణిశ్రీ పలుచోట్ల ప్రచారం నిర్వహించారు.
రాజవొమ్మంగి జెడ్‌పిటిసి అభ్యర్థి లోతా రామారావును గెలిపించాలని సిపిఎం రాష్ట్ర నాయకులు వి వెంకటేశ్వర్లు ఓటర్లను కోరారు. ఎటపాక మండలంలోని విస్సాపురం ఎంపిటిసి స్థానంలోని సిపిఎం అభ్యర్థి సోందే రామారావు, అల్లూరి జిల్లా హుకుంపేట మండలం ఎంపిటిసి అభ్యర్థి కొర్రా అరుణ గెలుపును కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని 1, 4, 36 వార్డుల్లో సిపిఎం చైర్‌పర్సన్ అభ్యర్థి ధరణికోట విమల, 24, 22 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు అవ్వారు ప్రసాదరావు, పంతంగి ప్రభాకర్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఓ హోటల్లో ధరణికోట విమల దోశ వేసి ఆకట్టుకున్నారు.












కామెంట్‌లు (0)