ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకలను గెలిపించండి..

2 గంటల క్రితం

ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకలను గెలిపించండి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026, 11:31 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

  • సిపిఎం విస్తృత ప్రచారం

  • బైకు ర్యాలీలు, పాదయాత్రలు

ప్రజాశక్తి - యంత్రాంగం : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పోరాడుతున్న సిపిఎం అభ్యర్థుల గెలుపునకు ఆ పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, జడ్‌పిటిసి, ఎంపిటిసి స్థానాల్లో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థులకు మద్దతుగా ఆదివారం బైక్‌ ర్యాలీలు, పాదయాత్రలు, ఇంటింటి ప్రచారాలు చేపట్టారు. నగరాలు, పట్టణాల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రజల తరఫున ప్రశ్నించే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని ఆయా ప్రాంతాల్లో ప్రచారానికి హాజరైన పార్టీ నాయకులు ఓటర్లను కోరారు.

గ్రేటర్‌ ‌విశాఖ మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ (‌జివిఎంసి) ఎన్నికల బరిలో ఉన్న 66వ వార్డులో జరిగిన ప్రచారంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం పాల్గొని మాట్లాడారు. 13, 16 వార్డుల్లో సిపిఎం అభ్యర్థులు సంగిరెడ్డి గౌరి, రంగమ్మలను, 115వ వార్డులో బలివాడ వెంకటరావును, 96వ వార్డులో డి.రమణను, 98వ వార్డులో ఎం.రాంబాబును గెలిపించాలని బైకు ర్యాలీ నిర్వహించారు. రెండవ వార్డులో ఆర్‌ఎస్‌ఎన్‌.మూర్తి , 105వ వార్డు అభ్యర్థి కృష్ణయ్య, 106వ వార్డు అభ్యర్థి బొద్దపు శ్రీనివాసరావును గెలిపించాలని పార్టీ రాష్ట్ర నాయకులు సిహెచ్.నర్సింగరావు కోరారు. 45వ వార్డు అభ్యర్థి భాగవతుల లక్ష్మీనారాయణను గెలిపించాలని కోరుతూ జరిగిన ప్రచారంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో సిపిఎం జెడ్‌‌పిటిసి, ఎంపిటిసి అభ్యర్థులను గెలిపించాలని పార్టీ సీనియర్‌ ‌నాయకులు సిహెచ్‌ నర్సింగరావు కోరారు. కె.కోటపాడు మండలం సింగన్నదొరపాలెం సిపిఎం ఎంపిటిసి అభ్యర్థి ఈర్ల నాయుడు బాబును, అల్లూరి జిల్లాలోని హుకుంపేట ​మండలంలోని పట్టాం పంచాయతీ ఎంపిటిసి అభ్యర్థి కొర్రా అరుణను, పోలవరం జిల్లాలోని సిపిఎం అభ్యర్థుల గెలుపునకు ఎక్కడికక్కడ సమావేశాలు జరిగాయి. రాజవొమ్మంగి జెడ్‌పిటిసి అభ్యర్థి లోతా రామారావును గెలిపించాలంటూ జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు వి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

విజయనగరం నగర పాలక సంస్థ 56వ వార్డు కార్పొరేటర్ సిపిఎం అభ్యర్ధి పాలూరి రమణమ్మను గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ఓటర్లను కోరారు. మెంటాడ మండలం ఆండ్ర, పార్వతీపురం పట్టణంలోని రెండవ వార్డులోను, కొమరాడ మండలం చోళ్లపదం ఎంపిటిసి స్థానాల అభ్యర్థులకు మద్ధతుగా సిపిఎం నాయకులు ప్రచారం చేశారు.

​ అనంతపురం జిల్లా 25వ డివిజన్‌ అభ్యర్థి సాకే సరస్వతి, 60 డివిజన్‌ అభ్యర్థి సి గీత, 62వ డివిజన్‌ అభ్యర్థి ఎ గుల్జార్‌‌లు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 25వ డివిజన్‌‌ ప్రచారంలో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి వి సావిత్రి పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని 39వ వార్డులో పోటీ చేస్తున్న ముస్తక్‌ ఆలీకి మద్దతుగా సిపిఎం రాష్ర్ట నాయకుడు జి ఓబులు ప్రచారంలో పాల్గొన్నారు. అనంతపురం రూరల్‌ ‌మండలం రాజీవ్‌‌ కాలనీ ఎంపిటిసి -2 సిపిఎం అభ్యర్థి మసూద్‌‌వలి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు 25వ వార్డు జవహార్ పేట వీధుల్లో సిపిఎం అభ్యర్థి బొక్కా వెంకట వర్మ విజయాన్ని కాంక్షిస్తూ సిపిఎం రాష్ట్ర నాయకులు బి బలరాం పర్యటించారు. కాళ్లలో ఎంపిటిసి-1 సిపిఎం అభ్యర్థిగా గొర్ల రామకృష్ణ , కలిదిండిలో సానా రుద్రవరం ఎంపిటిసి అభ్యర్థి జక్కుల మహేష్, ​నూజివీడు మున్సిపాలిటీ 18వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థి జి సుజాత, అభ్యర్థులు పెనుమంట్ర జెడ్‌పిటిసి ఒకటి, రెండవ స్థానాల్లో పోటీ చేస్తున్న కేతా గోపాలన్, కోడి లక్ష్మి, సిపిఎం అభ్యర్థి కవురు లక్ష్మి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. ​ శ్రీకాకుళం పలాస సిపిఎం జెడ్‌పిటిసి అభ్యర్థి తెప్పల అజయ్ కుమార్‌, కొత్తూరు మండలంలోని గొట్టిపల్లి ఎంపిటిసి అభ్యర్థి నిమ్మక అప్పన్న ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మున్సిపాల్టీకు చైర్‌‌పర్సన్‌ అభ్యర్థి ధరణికోట విమల, 22వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పంతంగి ప్రభాకర్, 24వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి అవ్వారు ప్రసాదరావు విజయాన్ని కాంక్షిస్తూ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు హరికిషోర్‌ ‌పాల్గొని మాట్లాడారు. గుంటూరు జిఎంసి 63వ డివిజన్‌ అభ్యర్థి గోనే లూథర్ పాల్‌‌, ​నెల్లూరు జిల్లా 72వ డివిజన్ అభ్యర్థి గజ్జె పరమేశ్వరిని ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్