సిపిఎం అభ్యర్థుల విసృత్త ప్రచారం
ప్రజాశక్తి - యంత్రాంగం : రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో సిపిఎం అభ్యర్థులు శనివారం విసృత్తంగా ప్రచారం నిర్వహించారు. ప్రజా సమస్యలపై పోరాడేవారిని, నిరంతరం ప్రజలతో మమేకమై వారి సమస్యలపై పోరాడే వారిని గెలిపించాలని సిపిఎం నాయకులు కోరారు. డివిజన్లు, వార్డుల్లో అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరు తమ అమూల్యమైన ఓటును సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
విజయనగరంలో 56వ వార్డు అభ్యర్థి పి.రమణమ్మ, మెంటాడ మండలం ఆండ్ర ఎంపిటిసి పరిధిలో పనసలవలస , కొండజీలకవలస, కుంబి వలస, ఆండ్ర గ్రామాల్లో సిపిఎం అభ్యర్థి రాకోటి రాములు, జెడ్‌పిటిసి అభ్యర్థి సిడగం శాంతి ప్రచారం నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా మున్సిపల్ పరిధిలో ఏడవ వార్డుకు పోటీ చేసిన సిపిఎం అభ్యర్థి బంకురు జయలక్ష్మిని గెలిపించాలని సిపిఎం రాష్ట్రదర్శి వర్గ సభ్యురాలు కె.సుబ్బరావమ్మ పిలుపునిచ్చారు.
విశాఖపట్నం 98వ వార్డులో ఎం.రాంబాబుకు మద్దతుగా పార్టీ కేంద్రకమిటీ సభ్యులు కె.లోకనాథం ప్రచారం చేశారు. 77వ వార్డులో ఆర్.విమల గెలుపు కోరుతూ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. 2, 7, 13, 16, తదితర వార్డుల్లో సిపిఎం కార్పొరేటర్ అభ్యర్థులకు మద్దతుగా వామపక్షాలు, ప్రజాసంఘాల నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీలోని 20వ వార్డులో దగ్గు అశోక్ కుమార్, నిడదవోలు ఆరో వార్డులో జువ్వల రాంబాబు... సిపిఎం, ప్రజా సంఘాల నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం 16వ వార్డులో నెక్కల మనంగ, 20వ వార్డులో కూనిరెడ్డి అప్పన్న, సామర్లకోట 32వ వార్డులో బాలం హరిబాబు, పిఠాపురం 21వ వార్డులో గౌరోజు వీరబాబు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ 17వ వార్డులో సఖిలే సూర్యనారాయణ విసృత్తంగా ప్రచారం నిర్వహించారు.
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీలోని 20వ వార్డులో దగ్గు అశోక్ కుమార్, నిడదవోలు ఆరో వార్డులో జువ్వల రాంబాబు... సిపిఎం, ప్రజా సంఘాల నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం 16వ వార్డులో నెక్కల మనంగ, 20వ వార్డులో కూనిరెడ్డి అప్పన్న, సామర్లకోట 32వ వార్డులో బాలం హరిబాబు, పిఠాపురం 21వ వార్డులో గౌరోజు వీరబాబు ఇంటింటా ప్రచారం చేశారు. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ 17వ వార్డులో సఖిలే సూర్యనారాయణ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అనంతపురం జిల్లా కేంద్రంలో 60, 62, 25 వార్డులతో గుత్తి, గుంతకల్లులో ప్రచారం చేశారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 70, 71 డివిజన్‌లో సిపిఎం అభ్యర్థులు కత్తి శ్రీనివాసులు, షేక్ షకీల ప్రచారం నిర్వహించారు.








కామెంట్‌లు (0)