సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionజగన్‌‌వి హింసా రాజకీయాలు : మంత్రి అనగాని సత్యప్రసాద్‌

4 గంటల క్రితం

anagani
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 08:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి అధినేత వైఎస్ జగన్‌‌వి హింసా రాజకీయాలు అని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఛాంపియన్ కూటమే అని అన్నారు. పుంగనూరు, తిరుపతి, రాయచోటి, పులివెందుల, కడప, దర్శి, కనిగిరి ప్రాంతాల్లో చోటుచేసుకున్న దాడులు అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ​స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసిపి రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు, విధ్వంసాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కుట్రలు, దాడులు, విధ్వంసాలతో ప్రజల ఓట్లు సాధించలేరని జగన్ గుర్తించాలన్నారు. ఓటమి భయంతోనే వైసిపి నేతలు పోలీసులపై అసభ్యకరమైన బూతు పురాణం వాడుతున్నారని ఎమ్మెల్సీ వర్ల రామయ్య టిడిపి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి.. పోలీసులను అసభ్య పదజాలంతో ధూషించడం తగదన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్