ప్రజాశక్తి - అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. రెండో విడతలో 1,171 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 3,803 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా గ్రామ పంచాయతీల్లో పోలింగ్ నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
పల్నాడు జిల్ల బెల్లంకొండ మండలం వన్నాయి పాలెం గ్రామంలో ఓట్లు వేయడానికి బారులు తీరిన ఓటర్లు
అనపర్తి మండలంలో 30.56 శాతం పోలింగ్
అనపర్తి మండలంలో ఉదయం 9 గంటలకు 30.56 శాతం పోలింగ్ నమోదు.. మండలంలో మొత్తం ఓటర్లు 51,589 కాగా 9 గంటలకు 15,764 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
యల్లనూరులో పోలింగ్ ప్రారంభం
ప్రజాశక్తి - యల్లనూరు: ఘర్షణ అనంతరం యల్లనూరులో తిరిగి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

అనంతపురం జిల్లా కదిరి మండలంలో ఉదయం 9 గంటల వరకు 31 శాతం పోలింగ్

గుంటూరు జిల్లా కొల్లిపర మండలం లో 9.30 గంటలకు 30.33 శాతం పోలింగ్ నమోదు..

పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది ఆదివారం ఉదయం 9 గంటల సమయానికి నాలుగు మండలాల పరిధిలో 29.15 శాతం పోలింగ్ నమోదైంది

ఉంగుటూరు మండలం చేబ్రోలులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో వివరాలు సరిగా కనిపించక ఓటర్లు తికమక

అల్లూరి జిల్లాలోని విఆర్‌పురం మండలంలో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు

చిత్తూరు జిల్లా పీలేరులో తమ ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాథ్ రెడ్డి ఆయన కుమారుడు జీవి రాకేష్ రెడ్డి

అనంతపురం జిల్లా కదిరి మండల పరిధిలోని ఎర్రదొడ్డి గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్న యువకులు

కొల్లూరు మండలం లో గ్రామపంచాయతీలకు ఓటు వేయటానికి బారులు తీరిన ఓటర్లు ఉదయం 9 గంటలకు 33% నమోదయింది

కాకినాడ జిల్లా రాజుపాలెంలో ౩వార్డు పోలింగ్ కేంద్రంలో గందరగోళం.. బరిలో ముగ్గురు అభ్యర్థులు, బ్యాలెట్‌లో రెండే పేర్లు.. అయోమయంలో ఓటర్లు

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామంలో పొన్నూరు రూరల్ ఎస్సై శ్రీహరి ఓవరాక్షన్.. ఎస్సై నెట్టడంతో ఓ మహిళ కిందపడిపోయింది.

పీలేరులో పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరిన ఓటర్లు
నాగంబొట్లపాలెంలో ఘర్షణ.. బ్యాలెట్ బాక్సులో ఇంకు
ప్రజాశక్తి - ప్రకాశం: ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం నాగంబొట్లపాలెంలో పోలింగ్ కేంద్రం వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు బ్యాలెట్ బాక్సులో ఇంకు పోశారు. ఘటనతో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది.

తొండవాడ పోలింగ్ కేంద్రం వద్ద వాగ్వాదం
ప్రజాశక్తి - చంద్రగిరి: చంద్రగిరి నియోజకవర్గంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తొండవాడలో ఉదయం నుంచే ఓటర్లు భారీగా తరలివచ్చి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అయితే పోలింగ్ కేంద్రం వద్ద సమాచార లోపంతో పోలీసులు, ఓటర్ల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.

యల్లనూరులో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడులు
అనంతపురం: అనంతపురం జిల్లా యల్లనూరులో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ పోలింగ్ ఏజెంట్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. మాజీ మంత్రి శైలజానాథ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

శ్రీకాకుళం జిల్లా కొండములగాంలో పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు..

యర్రావారిపాలెం మండలం నెరబైలు పంచాయతీలో ఓట్లు వేస్తున్న ఓటర్లు

అన్నమయ్య జిల్ల సోమల పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు..

పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు
పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల ఏకపక్ష వైఖరిపై ఆయన జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. తన వాహనం ఎక్కేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో ఇంటి నుంచి పార్టీ కార్యాలయానికి నడుచుకుంటూ వెళ్లారు.

శ్రీకాకుళం జిల్లాలోని జె.ఆర్.పురంలో బారులు తీరిన ఓటర్లు

అనంతపురం జిల్లా నల్లచెరువులో ఉదయం 6.30 గంటలకే ఓటు వేసేందుకు క్యూ లైన్లలో నిలిచిన ఓటర్లు.

వేంపల్లెలో తెల్లవారుజామునే బూత్ వద్ద బారులు తీరిన ఓటర్లు

వీరఘట్టంలో బారులు తీరిన ఓటర్లు








కామెంట్‌లు (0)