శనివారం, 24 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకూటమిలో భగ్గుమన్న విభేదాలు

3 గంటల క్రితం

IMG20261024WA0655-1792856476964-9291.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026, 12:39 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • జనసేన నాయకులపై టిడిపి దాడి

  • నామినేషన్‌ ‌వేయనీయకుండా అడ్డగింత

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : ప్రాదేశిక ఎన్నికల నామినేషన్‌ ‌సందర్భంగాల్లో పల్నాడు జిల్లా నాగిరెడ్డిపాలెం ఎంపిటిసి స్థానం విషయంలో కూటమిలో విబేధాలు భగ్గుమన్నాయి. జనసేన వారిపై టిడిపి వారు దాడి చేశారు. నామినేషన్‌ ‌వేయనీయకుండా అడ్డుకున్నారు. శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి జనసేన నాయకుల కథనం ప్రకారం... జనరల్‌ మహిళకు కేటాయించిన నాగిరెడ్డిపాలెం ఎంపిటిసి స్థానానికి ‌జనసేన తరఫున నామినేషన్‌ ‌వేయడానికి తన భర్త పగడాల శ్రీనివాసరావుతో కలిసి బెల్లంకొండకు పగడాల శ్రావణి వచ్చారు. వారిని టిడిపి వారు అడ్డుకొని నామినేషన్‌ ‌పత్రాలను లాక్కున్నారు. శ్రీనివాసరావుపైనా, ఆయనతోపాటు ఉన్న జనసేన నాయకులపైనా దాడికి పాల్పడి అక్కడి నుంచి తరిమికొట్టారు. దీంతో, ఉద్రిక్తత నెలకొంది. దీనిపై శ్రీనివాసరావు మాట్లాడుతూ నామినేషన్ వేయనీయకుండా టిడిపి నాయకులు అడ్డుకొని తమను కర్రలతో కొట్టారని, తన కాలికి పెద్ద గాయమైందని ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి నాయకుడు అక్కల వెంకటరామిరెడ్డి, మరో నలుగురు కలిసి తమపై దాడి చేశారని వాపోయారు. కూటమిలోని పార్టీపై కూడా టిడిపి నాయకులు దాడి చేయడం పట్ల జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మిత్ర ధర్మానికి విరుద్ధమని, నామినేషన్‌ ‌వేసే హక్కు ఎవరికైనా ఉందని, అడ్డుకొని దాడి చేయడం సరికాదని అన్నారు. ​ఈ ఘటనపై పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ ‌వివరణ ఇస్తూ... జనసేనకు చెందిన శ్రీనివాసరావు టిడిపి నాయకుల చొక్కా పట్టుకొని అమర్యాదగా ప్రవర్తించిన సందర్భంలో ఘర్షణ జరిగిందని పేర్కొన్నారు. పోలీసులు జోక్యం చేసుకుని అక్కడున్న వారందరినీ చెదరగొట్టారని తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్