గురువారం, 29 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపెన్షన్ల పంపిణీలో టిడిపి కార్యకర్తలు

7 గంటల క్రితం

ycp.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 08:44 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఓటర్లను ప్రభావితం చేయకుండా చూడాలి

  • ఎస్‌ఇసికి వైసిపి లేఖ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో నవంబరు 1న జరిగే పెన్షన్ల పంపిణీ సందర్భంగా టిడిపి కార్యకర్తలు ఓటర్లను ప్రభావితం చేయకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి వైసిపి విజ్ఞప్తి చేసింది. దీనిపై గురువారం వైసిపి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి నాలుగు లేఖలు రాశారు. అర్నబ్‌ తుపాన్‌ నేపథ్యంలో ఎస్‌‌సి, ఎస్‌‌టి, బిసి మహిళా ఓటర్ల జాబితాల తయారీకి ఇచ్చిన షెడ్యూల్‌ను సవరించాలని కోరారు. మున్సిపల్, ఎంపిటిసి జెడ్‌‌పిటిసి ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధులను వేధించిన అధికారులపై దర్యాప్తు చేయించి, తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మదనపల్లెలో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్‌ 30న జరుగుతున్న పెన్షన్ల పంపిణీలో టిడిపి నాయకులు, పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి వెళ్లి లబ్ధిదారుల ఇళ్లను సందర్శించి, అధికార పార్టీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉందని తెలిపారు. ప్రజాసంక్షేమ పథకం కింద అందించే పింఛన్ల పంపిణీని ఎన్నికల ప్రచారానికి లేదా ఓటర్లను ప్రలోభపెట్టడానికి ఉపయోగించే ప్రమాదం ఉందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మదనపల్లెలో మున్సిపల్‌ ఎన్నికల సమయంలో అభ్యర్థులు, పోలింగ్‌ ఏజెంట్లు, ఓటర్లను బెదిరించే అవకాశం ఉందని, వారిని అడ్డుకునే అవకాశమూ ఉందని మదనపల్లె మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి జింకా వెంకట చలపతి లేవనెత్తిన ఆందోళనలను ఎన్నికల కమిషన్‌ దృష్టికి తెచ్చారు. మదనపల్లెలో ఎన్నికల ముందు కొంతమంది వ్యక్తులను ఇందుకోసం సమీకరించినట్లు తమకు సమాచారం అందిందని అభ్యర్థి పేర్కొన్నట్లు లేఖలో తెలిపింది. తుపాను కారణంగా ఏర్పడిన అంతరాయాలు, ఓటర్ల వివరాల ధ్రువీకరణకు తగిన సమయం లేకపోవడంతో ఎస్‌‌సి, ఎస్‌‌టి, బిసి మహిళా ఓటర్ల జాబితాల తయారీ షెడ్యూల్‌ను సవరించాలని కోరారు. నామినేషన్ల ప్రక్రియలో పోలీసు అధికారుల పక్షపాత వైఖరి, జోక్యం, నామినేషన్ల దాఖలుకు అడ్డంకులు, బలవంతపు ఉపసంహరణలపై వచ్చిన తీవ్రమైన ఫిర్యాదులను కమిషనర్‌‌కు తెలిపారు. ఇప్పటివరకు తమ వినతిపత్రాలపై తీసుకున్న చర్యలు లేదా హైకోర్టు ఆదేశాల అమలుకు సంబంధించిన వివరాలు కమిషన్‌ నుంచి తమకు అందలేదని లేఖలో పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్