శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దాచేపల్లి వైసిపి ఛైర్మన్‌ అభ్యర్థి ఇంట్లో తెలంగాణ మద్యం - అరెస్టు

1 గంట క్రితం

Telangana liquor found at the home of YSRCP chairman candidate in Dachepalli – arrest made
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 11:57 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

దాచేపల్లి : స్థానిక సంస్థల ఎన్నికల్లో దాచేపల్లి నగర పంచాయతీ నుంచి వైసిపి తరఫున ఛైర్మన్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎంపికైన కొప్పుల రవి ఇంట్లో తెలంగాణ మద్యం దొరకడంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఛైర్మన్‌ పదవికి నామినేషన్‌ దాఖలు చేసే రోజు మద్యాన్ని పంపిణీ చేయడానికి రవి అనుచరుడు బుర్రి అనిల్‌తో పాటు మరికొందరు తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఎస్సై ఖాసింవలి శుక్రవారం తెల్లవారుజామున రవి నివాసంలో తనిఖీలు చేపట్టగా, రూ.64,640 విలువైన 429 మద్యం సీసాలు దొరికాయి. కేసు నమోదు చేసిన పోలీసులు.. రవి, అనిల్‌లను అరెస్ట్‌ చేశారు. ‘నామినేషన్‌ సందర్భంగా అందరూ మద్యం పంపిణీ చేస్తారని, ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ కదా!’ అని రవి సిఐ కి చెప్పి వదిలేయాలని కోరారు. ఈ వ్యవహారంతో రవికి సంబంధం లేదని, మద్యం తీసుకొచ్చి భద్రపరిచింది తానేనని బుర్రి అనిల్‌ సిఐ ఖాజావలికి చెప్పి, తనను మాత్రమే అరెస్టు చేయాలని కోరడం గమనార్హం. మరోవైపు వైసిపి నాయకులు దాచేపల్లి పోలీసు స్టేషన్‌ ఎదుట కొంతసేపు ఆందోళన చేశారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి, వైసిపి నాయకుడు మురళీధర్‌రెడ్డి స్టేషన్‌కు చేరుకొని సిఐతో వాగ్వాదానికి దిగారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా, ఈ నెల 30 వరకు రిమాండ్‌ విధించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్