శనివారం, 31 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనేడే ‘పుర’ పోలింగ్‌

3 గంటల క్రితం

ELECTION8-1793454190254-9217.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 12:25 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • 92 పట్టణ స్థానిక సంస్థల్లో ఓటింగ్‌

  • ఓటర్లు 99.36 లక్షలు

  • పోటీలో 9,742 మంది అభ్యర్థులు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల్లో ఆదివారం పోలింగు నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. 13 నగర కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు 3న ఉంటుంది. పోలింగు ‌సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు 36,351 మందితో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఇసి, డిజిపి తెలిపారు. నామినేషన్ల సందర్భంగా కొన్నిచోట్ల పెద్దయెత్తున హింస చెలరేగిన నేపథ్యంలో ఓటింగు ‌రోజు పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనన్న ఆందోళనలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. కార్పొరేషన్లలో మేయర్‌ పదవులకు 153 మంది, మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవులకు 367 మంది పోటీలో ఉన్నారు. కార్పొరేషన్లలోని 922 వార్డులకు గానూ 118 ఏకగ్రీవమవ్వగా, 804 వార్డులకు గానూ 3,073 మంది పోటీలో ఉన్నారు. పురపాలక సంఘాల్లో 3,030 వార్డులకు గానూ 638 ఏకగ్రీవమవ్వగా, 2,382 వార్డులకు 6,669 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తంగా 9,742 మంది పోటీలో ఉన్నారు. ఎన్నికలకు 12,244 పోలింగు ‌స్టేషన్లను గుర్తించగా, 11,378 పోలింగు స్టేషన్లు అవసరమయ్యాయి. కార్పొరేషన్లలో 59,97,918 ఓట్లు, మున్సిపాలిటీలలో 39,38,096 మంది ఓటర్లు మొత్తంగా 99,36,014 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆర్‌ఒలు (రిటర్నింగ్ అధికారులు) 1,449 , ఎఆర్‌ఒలు 2,543, ప్రిసైడింగ్ అధికారులు13,504, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు 13,504, ఇతర పోలింగు సిబ్బంది 51,716, జోనల్‌ అధికారులు 588, రూట్‌ అధికారులు 1511, మైక్రో అబ్జర్వర్లు 3,720, వెబ్‌కాస్టింగ్ సిబ్బంది 1,835 మందిని నియమించారు. పోలింగు కేంద్రాల్లో భద్రతా పర్యవేక్షణ కోసం మొత్తం 12,666 సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలింగు కేంద్రాలతో పాటు స్ట్రాంగ్ రూమ్‌లు, పాసేజ్‌లు, వరండాలు, కౌంటింగ్ హాళ్లలో, బ్యాలెట్‌ ‌బాక్సులు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద, పరిసరాల్లో సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.

​ఒత్తిడికి తావు లేకుండా ఓటు వేయండి : అనిల్‌‌ చంద్ర పునేఠా

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ప్రతి ఓటరు ఎలాంటి భయం, ఒత్తిడికి తావులేకుండా తమ ఓటు హక్కును వినియోగించు కునేలా పటిష్ట చర్యలు తీసుకున్నామని శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 8 మున్సిపాలిటీలు (పిడుగురాళ్ల, గురజాల, దాచేపల్లి, దార్సి, పలమనేరు, ప్రొద్దుటూరు, రాయచోటి, కమలాపురం) ఏకగ్రీవమైనందున అక్కడ ఎన్నికలు జరగడం లేదన్నారు. రాజకీయ పార్టీల విజ్ఞప్తుల మేరకు ఎన్నికల వీడియో ఫుటేజీ భద్రపరిచే గడువును 40 నుంచి 60 రోజులకు పెంచినట్లు వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి ఎ మల్లికార్జున, సిడిఎంఎ డైరెక్టర్ పి సంపత్ కుమార్, ఐజి బి రాజకుమారి మాట్లాడారు.

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్