సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమాజీ మంత్రి రజిని ఇంటివద్ద ఘటనపై ఎఎస్‌‌పి విచారణ

3 గంటల క్రితం

మాజీ మంత్రి రజిని ఇంటివద్ద ఘటనపై ఎఎస్‌‌పి విచారణ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 08:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-చిలకలూరిపేట (పల్నాడు జిల్లా) : మాజీ మంత్రి విడదల రజిని నివాసం వద్ద ఇటీవల జరిగిన వివాదంపై విచారణ కోసం జిల్లా అడ్మిన్‌ అదనపు ఎస్‌‌పి రోహిత్‌‌కుమార్‌ ‌చౌదరి సోమవారం పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు వచ్చారు. తొలుత అర్బన్‌ ‌పోలీస్‌‌స్టేషన్‌‌ను సందర్శించిన ఆయన పోలీసులు, అధికారులతో మాట్లాడారు. అనంతరం రజని ఇంటికి వెళ్లారు. సుమారు గంటకుపైగా అక్కడ ఉండి వివరాలు సేకరించారు. వైసిపికి చెందిన జెడ్‌‌పిటిపి అభ్యర్థి బి-ఫారం తీసుకోవడానికి రజనీ ఇంటికి ఇటీవల వచ్చిన సందర్భంలో ఆయనను పోలీసులు అనుమతించలేదు. రజని బయటకు వచ్చి తమ పార్టీ అభ్యర్థిని కలవాలని చూసినా పోలీసులు అంగీకరించలేదు. ఈ క్రమంలో మాజీ మంత్రి రజనీని మహిళా ఎస్‌ఐ ప్రియాంక తోసివేయడంతో ఆమె కిందపడిపోయిన విషయం తెలిసిందే. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణకు ఎఎస్‌‌పి వచ్చారు. ఆయన వెంట పట్టణ సిఐ రమేష్, ఇతర పోలీస్‌‌ సిబ్బంది ఉన్నారు.

​​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్