కొచ్చి : సిఎంఆర్ఎల్ ఎక్సాలాజిక్ లంచం కేసులో కేరళం ప్రతిపక్ష నేత పినరయి విజయన్, ఆయన కుటుంబ సభ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు ఉత్తర్వులపై రాష్ర్ట హైకోర్టు సోమవారం స్టే విధించింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తును కూడా హైకోర్టు నిలిపివేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుకు వ్యతిరేకంగా విజయన్, ఆయన కుమార్తె టి. వీణ, అల్లుడు, మాజీ మంత్రి పి.ఎ. మహమ్మద్ రియాస్ దాఖలు చేసిన అప్పీళ్లను జస్టిస్ కె. నటరాజన్, జాన్సన్ జాన్‌లతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణకు స్వీకరించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న ఉత్తర్వుపై స్టే విధించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ కేసును ఇడి దర్యాప్తు చేస్తోంది. సింగిల్ బెంచ్ ఉత్తర్వుకు వ్యతిరేకంగా విజయన్, ఆయన బంధువులు ముందుగా సుప్రీంకోర్టును ఆశ్రయించగా, పునఃపరిశీలన కోసం కేసును డివిజన్ బెంచ్‌కు తిరిగి పంపిన సంగతి తెలిసిందే. తమ వాదన వినకుండానే సింగిల్ జడ్జి ఎఫ్‌ఐఆర్ నమోదుకు ఆదేశించారని విజయన్ చేసిన వాదనను సుప్రీంకోర్టు సమర్థించింది.
Print Editionపినరయి విజయన్ ఎఫ్‌ఐఆర్‌పై కేరళం హైకోర్టు స్టే
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 27, 2026, 12:36 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)