గురువారం, 29 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసిపిఎం అభ్యర్థులకు ఎల్లెడలా ఆదరణ

3 గంటల క్రితం

సిపిఎం అభ్యర్థులకు ఎల్లెడల ఆదరణ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 11:22 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - యంత్రాంగం : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌, జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థులు గురువారం ప్రచారాన్ని ఉధృతం చేశారు. డివిజన్లు, వార్డులు, గ్రామాల్లో ఇంటింటి ప్రచారాలు, ర్యాలీలు నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న అభ్యర్థులను గెలిపించాలని సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుపై ఓటు వేయాలని పార్టీ నాయకులు కోరారు.

పార్వతీపురం మన్యం జిల్లాలో 35వ వార్డు సిపిఎం అభ్యర్థి పద్మనాభం సుశీలను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె సుబ్బరావమ్మ కోరారు. సీతంపేట మండలంలో ధారపాడు ఎంపిటిసి అభ్యర్థి జీలకర్ర సుందరమ్మ కిల్లాడ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సాలూరు మండలంలోని అన్నంరాజువలస ఎంపిటిసి అభ్యర్థి వంతల జ్యోతి ప్రచారం చేశారు.

విజయనగరం జిల్లా 56వ డివిజన్ అభ్యర్థి పాలూరి రమణమ్మ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మెంటాడ మండలం ఇప్పలవలస గ్రామంలో జెడ్‌పటిసి అభ్యర్థి సిరగం శాంతి, కొండ లింగాలవలస ఎంపిటిసి అభ్యర్థి చిలక సింహాచలమ్మ, లోతుగెడ్డ ఎంపిటిసి అభ్యర్థి రాకోటి రాములు, పిట్టాడలో ఎంపిటిసి అభ్యర్థి తామరపల్లి కుమారి గుర్ల ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

అల్లూరి జిల్లా అరకులోయ జెడ్‌‌పిటిసి అభ్యర్థి గెమ్మెలి చిన్నబాబు, పద్మాపురం -2 ఎంపిటిసి అభ్యర్థి జన్ని భగత్ రామ్‌‌లను గెలిపించాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర కోరారు. ముంచంగిపుట్టు మండలంలో జెడ్‌‌పిటిసి అభ్యర్థి కొర్రా త్రినాధ్‌‌ను గెలిపించాలంటూ సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం విస్తృత ప్రచారం చేపట్టారు.

గ్రేటర్‌ ‌విశాఖ మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌‌లో 13, 16 వార్డుల అభ్యర్థులు సంగిరెడ్డి గౌరి, శీరెడ్డి రంగమ్మ, 7వ వార్డు అభ్యర్థి బి భారతి, 66వ వార్డు అభ్యర్థి బొట్టా ఈశ్వరమ్మ, 106వ వార్డు అభ్యర్థి బొద్ధపు శ్రీనివాసరావు ఓటర్ల ఇంటికి వెళ్లి తమకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. పోలవరం జిల్లాలో విఆర్‌ పురం మండలం జెడ్‌‌పిటిసి అభ్యర్థి కారం సుజాత, శ్రీరామగిరి ఎంపిటిసి అభ్యర్థి పులి సంతోష్‌‌ కుమార్‌, రామవరం పంచాయతీలో ఎంపిటిసి అభ్యర్థి కారం సుందరయ్య, రేఖపల్లి ఎంపిటిసి అభ్యర్థి చింతకాయల రజిని, ములకనపల్లి పంచాయతీలో ఎంపిటిసి అభ్యర్థి సొంది నాగమణి గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. చింతూరు మండలంలోని సిపిఎం ఎంపిటిసి, జెడ్‌‌పిటిసి అభ్యర్థులు ప్రచారం చేశారు. మారేడుమిల్లి సిపిఎం జెడ్‌‌పిటిసి అభ్యర్థి మట్ల వాణిశ్రీ, రాజవొమ్మంగి జెడ్‌‌పిటిసి అభ్యర్థి లోతా రామారావును గెలిపించాలంటూ పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేశాయి. అనకాపల్లి జిల్లాలోని జెడ్‌‌పిటిసి అభ్యర్థి కాళ్ల తేలయ్యబాబు ప్రచారం నిర్వహించారు.

ఏలూరు జిల్లా ఏలూరు 34వ డివిజన్‌ అభ్యర్థి ఎర్ర రాంబాబు, 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పసల సూర్యారావు 18వ వార్డు అభ్యర్థి జి సుజాత ప్రచారం సాగించారు.

పశ్చిమగోదావరి జిల్లా 23, 25 వార్డుల్లో అభ్యర్థులు సందక ఉదయకుమారి, బివి.వర్మ విస్తృత ప్రచారం నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం జెడ్‌పిటిసి అభ్యర్థి కవురు లక్ష్మి ప్రచారం సాగించారు. సిపిఎం పెనుమంట్ర జెడ్‌పిటిసి అభ్యర్థి కేతా గోపాలన్‌ భట్లమగుటూరులో తుపాన్‌ ‌బాధిత రైతులు, పేదలను పరామర్శించారు. ఏలూరు జిల్లాలో సిపిఎం బుట్టాయగూడెం జెడ్‌పిటిసి అభ్యర్థి తెల్లం నాగమణిని గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి బలరాం విజ్ఞప్తి చేశారు.

కర్నూలు జిల్లా మేయర్‌ అభ్యర్థి బి శ్యామల.. సిపిఐ కార్పొరేటర్‌ అభ్యర్థి గిడ్డమ్మతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నెల్లూరు జిల్లా 18వ డివిజన్ అభ్యర్థి పిట్ల దివ్యని గెలిపించాలని కోరుతూ పార్టీ మాజీ కౌన్సిలర్ పిట్లా చెంచులక్ష్మి కోరారు.

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం జెడ్‌‌పిటిసి అభ్యర్థి గండి సునీల్ కుమార్ ఇంటింటి ప్రచారం చేశారు. అనంతపురం కార్పొరేషన్‌ ‌పరిధిలో 25, 60, 62 వార్డుల అభ్యర్థులు సాకే సరస్వతి, సి గీత, ఎ గుల్జార్‌‌లు ఆయా వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గుంతకల్లు పట్టణంలో 17, 34, 40 వార్డుల అభ్యర్థులు యాకపోతు జయమ్మ, హోసూరు సరస్వతి, యబుటం చిన్న వీరన్న, 24 వార్డు అభ్యర్థి వి నిర్మల ప్రచారం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం 39వ వార్డు అభ్యర్థి ముస్తక్‌ ఆలీఖాన్‌ విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రాదేశిక ఎన్నికల్లో పుట్లూరు, కనగానపల్లి జెడ్‌పిటిసి అభ్యర్థులు ప్రచారం చేశారు.

శ్రీకాకుళం జిల్లా మందస సిపిఎం జెడ్‌పిటిసి అభ్యర్థి రుష్యశృంగ బినిత కుమారి, పలాస జెడ్‌పిటిసి అభ్యర్థి తెప్పల అజయ్ కుమార్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎచ్చెర్ల జెడ్‌పిటిసి అభ్యర్థి పొందూరు చంద్రరావు, చిలకపాలెం ఎంపిటిసి అభ్యర్థి తోనంగి నందోడు తమను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్