ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్రజాస్వామ్యానికి చీకటి రోజు

1 గంట క్రితం

WhatsAppImage20261101at31648PM-1793546451302-1530.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 12:04 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఎస్‌ఇసి కార్యాలయం ఎదుట వైసిపి ధర్నా

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని వైసిపి నేతలు విమర్శించారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కార్యాలయం ఎదుట ఆదివారం ధర్నా నిర్వహించారు. అక్రమాలు జరిగిన ప్రాంతాల్లో పోలింగ్‌ రద్దు చేసి, రీ పోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వ, అధికార యంత్రాంగం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర చరిత్రలో ఇంతటి అరాచకాలు, అక్రమాలు గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. పోలీసులను, రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకుని వైసిపి అభ్యర్థులపై దాడులు చేస్తూ ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశారన్నారు. బ్యాలెట్‌ను ఎదుర్కోలేక బుల్లెట్‌ బాట పట్టారని విమర్శించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు సిసి కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించినా అమలు చేయడం లేదన్నారు. పులివెందుల, కడప, మదనపల్లె, చిత్తూరు, చీమకుర్తి, మాచర్ల, చిలకలూరిపేట తదితర ప్రాంతాల్లో అనేక అక్రమాలు జరిగాయన్నారు. ఎన్నికల సంఘం వైఫల్యంపై న్యాయ పోరాటం కొనసాగిస్తామన్నారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ.. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవస్థలు పనిచేస్తున్నాయన్నారు. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. పులివెందుల మున్సిపల్‌ ఛైర్మన్‌ అభ్యర్థి ప్రమీలమ్మ, జమ్మలమడుగు ఛైర్మన్ అభ్యర్థి హైమావతిపై దాడికి పాల్పడ్డారన్నారు. విశాఖ మేయర్‌ అభ్యర్థి వరుడు కల్యాణిపై సైతం దాడి చేశారన్నారు. ఎమ్మెల్సీ రుహుల్లా మాట్లాడుతూ.. గత 15 రోజులుగా వందలాది ఫిర్యాదులొచ్చినా చర్యలు శూన్యమన్నారు. ఎన్నికల కమిషనర్‌ ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారనే విషయం ఆయన స్పందనతో స్పష్టమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి, అంకంరెడ్డి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

1.webp

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్