ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని ఏడు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 12 వార్డులకు సోమవారం నాడు జరిగిన రీ పోలింగులో సాయంత్రం 5 గంటల వరకు 60.64 శాతం పోలింగు నమోదైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం 9,890 మంది ఓటర్లకు గానూ 6,041 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 12 వార్డుల్లోని 13 పోలింగు కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించారు. అత్యధికంగా జమ్మలమడుగు 29వ వార్డులో 75.14 శాతం పోలింగు నమోదైంది. జమ్మలమడుగు 17వ వార్డులో 70.41, ప్రకాశం జిల్లా చీమకుర్తి 14వ వార్డులో 73.44 శాతం చొప్పున పోలింగు నమోదైంది. అత్యల్పంగా తిరుపతిలోని 36వ వార్డులో 50.38 శాతం ఓటింగు నమోదైంది. వైఎస్ఆర్ కడప జిల్లాలో అత్యధికంగా ఎనిమిది వార్డుల్లో రీ పోలింగు నిర్వహించారు. పల్నాడు జిల్లా మాచర్ల, ప్రకాశం జిల్లా చీమకుర్తి, అనంతపురం, తిరుపతిలో ఒక్కో వార్డులో రీ పోలింగు జరిగింది.








కామెంట్‌లు (0)