ప్రజాశక్తి - యంత్రాంగం : జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల బరిలో నిలిచిన సిపిఎం అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సోమవారంనాడు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలుసుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాల సమగ్ర అభివృద్ధి, పేదలు, రైతులు, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం తమ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. పలు ప్రాంతాల్లో పార్టీ రాష్ట్ర నాయకులు కూడా ప్రచారంలో పాల్గొని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.
అనంతపురంజిల్లా పుట్లూరు జెడ్పిటిసి, అమరాపురం, చిలమత్తూరు మండలం కొట్నూరు-2 ఎంపిటిసి అభ్యర్థుల ప్రచారాలు కొనసాగాయి. శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి జెడ్పిటిసి అభ్యర్థి బత్తల కదిరప్పను గెలిపించాలని సిఐటియు రాష్ర్ట ఉపాధ్యక్షుడు జి ఓబులు కోరారు.
కర్నూలు జిల్లా రూరల్ మండలం గొందిపర్లలో ఎంపిటిసి అభ్యర్థి మునిస్వామి, దేవనకొండలో జెడ్పిటిసి అభ్యర్థి పావని, ఆదోని మండలం బసరకోడు ఎంపిటిసి అభ్యర్థి మునిస్వామి, ఆలూరు ఎంపిటిసి అభ్యర్థి షేకున్ బీ, నందవరం మండలంలో ఎంపిటిసి అభ్యర్థులు యల్లేష్, స్వామిదాసు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం పసురుపాడు ఎంపిటిసి అభ్యర్థి నడిపి చెన్నయ్య అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం బి మఠం జెడ్పిటిసి అభ్యర్థి గండి సునీల్ కుమార్‌ను గెలిపించాలని రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థించారు.
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నందిపాడు ఎంపిటిసి అభ్యర్థి గుజ్జుల మల్లికార్జున ఓటర్లను సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.
తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం త్యాజంపూడి ఎంపిటిసి-1 అభ్యర్థి అయినపర్తి శ్రీనివాసరావు, కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం ఇసుకపూడి ఎంపిటిసి అభ్యర్థి కొండేపూడి వీరవెంకట సత్యనారాయణ, కోరంగి-3 ఎంపిటిసి అభ్యర్థి టేకుమూడి ఈశ్వరరావు, తాళ్లరేవు-2 ఎంపిటిసి అభ్యర్థి నేరేడుమిల్లి త్రిమూర్తులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.
పశ్చిమగోదావరి జిల్లాలో అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి బలరాం ఆధ్వర్యంలో మోటారు సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. పెనుమంట్ర జెడ్పిటిసి అభ్యర్థి కేతా గోపాలన్, పాలకోడేరు జెడ్పిటిసి అభ్యర్థి శేషపు అశ్రియ్య, నరసాపురం జెడ్పిటిసి అభ్యర్థి కవురు లక్ష్మిని గెలిపించాలని కోరారు.
పోలవరం జిల్లా చింతూరు మండలంలోని చిడుమూరు, రతనాపురం, తుమ్మల. గంగన్న మెట్ట, కల్లేరు, శిరసనపల్లి సెగ్మెంట్లలో జెడ్పిటిసి అభ్యర్థి మిడియం శ్రీదేవి, చింతూరు 2 ఎంపిటిసి అభ్యర్థి సీసం సురేష్, కూనవరం -2 ఎంపిటిసి అభ్యర్థి మడకం నాగమణి ప్రచారం నిర్వహించారు. మారేడుమిల్లి జెడ్పిటిసి అభ్యర్థి మట్ల వాణిశ్రీ విజయాన్ని కాంక్షిస్తూ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎవి.నాగేశ్వరరావు ప్రచారం చేశారు. రాజవొమ్మంగి జెడ్పిటిసి అభ్యర్థి లోతా రామారావు గెలపించాలని పార్టీ రాష్ట్ర నాయకులు వి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 15 బృందాలు పల్లె పల్లెల్లో ప్రజల మధ్యకు వెళ్లి ప్రచారం నిర్వహిం చాయి. అల్లూరి జిల్లా అరకులోయ జెడ్పిటిసి అభ్యర్థి గెమ్మెలి చిన్నబాబు మాదల విస్తృతంగా ప్రచారం చేశారు. అనంతగిరిలో ఎంపిటిసి అభ్యర్థి దీసరి గంగరాజు, టోకూరు ఎంపిటిసి అభ్యర్థి దేవనను గెలిపించాలని ప్రచార సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర కోరారు. అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి జెడ్పిటిసి అభ్యర్థి కాళ్ల తేలయ్యబాబు, అచ్యుతాపురం జెడ్పిటిసి అభ్యర్థి గంగిరెడ్డి నారాయణమ్మ, నక్కపల్లి జెడ్పిటిసి అభ్యర్థి యాదగిరి నవీన్ పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం జెడ్పిటిసి అభ్యర్థి మండంగి శ్రీనివాసరావు, చెముడుగూడ ఎంపిటిసి అభ్యర్థి బిడ్డిక చామంతి గెలుపు కోసం మండలంలోని వివిధ గ్రామాల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ విస్తృతంగా ప్రచారం చేశారు.
విజయనగరం మెంటాడ మండలంలో ప్రచారం సాగింది. కురుపాం మండలం జెడ్పిటిసి అభ్యర్థి పాలక నరేష్ విస్తృత ప్రచారం నిర్వహించారు. కొమరాడ మండలం చోళ్ల పదం, పూడేసు ఎంపిటిసి అభ్యర్థులు ఊయక లావణ్య, కొండ గొర్రి మధు ప్రచారం చేశారు.
శ్రీకాకుళం జిల్లా పలాస జెడ్పిటిసి అభ్యర్థి తెప్పల అజయ్ కుమార్, మందస జెడ్పిటిసి అభ్యర్థి రుష్యశృంగ బినిత కుమారి, టెక్కలి జెడ్పిటిసి అభ్యర్థి కొల్లి ఎల్లయ్య, ఎచ్చెర్ల జెడ్పిటిసి అభ్యర్థి పొందూరు చంద్రరావుని గెలిపించాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి తులసీదాస్ విస్తృత ప్రచారం నిర్వహించారు.












కామెంట్లు (0)