సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకౌంటింగ్‌ పట్ల అప్రమత్తం..

7 గంటల క్రితం

Sajjala Ramakrishna
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 08:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • వైసిపి నాయకులతో సజ్జల

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్‌లో ప్రతి ఓటునూ కాపాడుకునేలా పార్టీ నాయకులు, కౌంటింగ్‌ ఏజెంట్లు పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని వైసిపి రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. మంగళవారం జరిగే కౌంటింగ్‌తో పాటు ఈ నెల 5న జరగనున్న జెడ్‌‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా నిరుత్సాహపడకుండా, ప్రతి ఓటునూ, ప్రతి స్థానాన్ని కీలకంగా భావించాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతో సజ్జల సోమవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టిడిపి వ్యవహరిస్తున్న తీరుతోపాటు కౌంటింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రాబోయే జెడ్‌‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, ధరల పెరుగుదల, అప్పుల భారం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు, ఆరోగ్య సేవల విషయంలో ప్రభుత్వ వైఫల్యాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ వైసిపి నాయకులు, కార్యకర్తలు సంఘటితంగా పనిచేయడం అభినందనీయమన్నారు. కౌంటింగ్‌లో ముఖ్యంగా మేయర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్