సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅక్రమాలు జరిగిన కేంద్రాల్లో రీ పోలింగు

6 గంటల క్రితం

Yelahanka Palace is mine YS Sharmila
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 09:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఎపిసిసి అధ్యక్షులు షర్మిల డిమాండ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బూత్ ఆక్రమణలు, దొంగ ఓట్లు, దౌర్జన్యాలు జరిగినట్లు వీడియోలు, ఫొటోల ఆధారాలు ఉన్న ప్రతి పోలింగ్ కేంద్రంలో రీ పోలింగు నిర్వహించాలని ఎపిసిసి అధ్యక్షులు షర్మిల డిమాండ్‌ ‌చేశారు. అన్ని పోలింగు కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష వెబ్‌కాస్టింగ్, సిసిటివి దృశ్యాలను నిష్పక్షపాతంగా పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సోమవారం ఒక ప్రకటనలో కోరారు. రిగ్గింగ్ చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బీహార్‌ను గుర్తు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో జరిగిన పరిణామాలు కూటమి ప్రభుత్వ ఓటమి భయానికి పరాకాష్ట అని పేర్కొన్నారు. ఎన్నికల సంఘాన్ని అధికార పార్టీకి అనుకూలంగా మార్చుకుని, విపక్ష అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం, నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, ఓటు హక్కు వినియోగించుకోకుండా నిరోధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్