తమిళనాడులో దీపావళి రోజు జరిగిన హత్యల్లో మృతి చెందిన 9 మంది ఎస్ఎస్ఐ, మృతి చెందిన పోలీసు కుటుంబానికి రూ. 40 లక్షల పరిహారం ప్రకటించిన విజయ్
తమిళనాడు : దీపావళి పండుగ రోజున తమిళనాడులో జరిగిన వివిధ ఘటనల్లో తొమ్మిది మంది మృతి చెందగా, వారిలో ఒక స్పెషల్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్ఎస్ఐ) కూడా ఉన్నారు. ఈ ఘటనను డిఎంకె, ఎఐఎడిఎంకె, పిఎంకె లతో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ తీవ్రంగా ఖండించాయి. ముఖ్యమంత్రి విజయ్ సోమవారం ఎస్ఎస్ఐ మృతికి సంతాపం తెలిపి, మృతి చెందిన పోలీసు కుటుంబానికి రూ.40 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. నివేదికల ప్రకారం ... సాదా దుస్తుల్లో విధి నిర్వహణ నుంచి తిరిగి వస్తున్న ఎస్ఎస్ఐ సెంథిల్ కుమార్ (57) తేని జిల్లాలోని సమధర్మపురం గ్రామంలో హత్యకు గురయ్యారు. రోడ్డును దిగ్బంధించి, బాణసంచా కాలుస్తూ ప్రజలలో భయాందోళనలు సృష్టిస్తూ, రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న యువకుల గుంపును ఎదుర్కొన్నందుకే ఆయనపై ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది.







కామెంట్‌లు (0)