పూణె : ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాల ఉల్లంఘనలను గుర్తించిన మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ర్టేషన్ (ఎఫ్‌డిఎ) పూణెలోని అమెజాన్, బిగ్‌బాస్కెట్ డార్క్ స్టోర్ల ఆహార లైసెన్సులను సస్పెండ్ చేసింది. సింహగడ్ రోడ్డులో ఉన్న ఈ కేంద్రాల్లో గడువు ముగిసిన ఆహార పదార్థాలు, అపరిశుభ్ర పరిస్థితులు, ఆహార భద్రత నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అమెజాన్ డార్క్ స్టోర్ తనిఖీల్లో గడువు ముగిసిన పదార్థాలతో పాటు వాటిపై బూజు, ఆహార కంటైనర్లలో దుమ్ము కనిపించాయి. నెయ్యి డబ్బాకు మూత దెబ్బతినడం, నూనె కారుతున్న ప్యాకెట్లు, పురుగుల నియంత్రణలో లోపాలు, సిబ్బంది పరిశుభ్రతకు సంబంధించిన రికార్డులు లేకపోవడం వంటి సమస్యలను గుర్తించారు. సబ్బు వంటి ఇతర వస్తువులను ఆహార పదార్థాలతో కలిపి నిల్వ చేయడం కూడా నిబంధనల ఉల్లంఘనగా గుర్తించారు. బిగ్‌బాస్కెట్ డార్క్ స్టోర్‌లో గడువు ముగిసిన కేకులు, బ్రెడ్, మిల్క్ రస్క్, చట్నీ తదితర పదార్థాలను గుర్తించారు. ఆహార వస్తువులను నేలపై ఉంచడం, దెబ్బతిన్న నేల, అపరిశుభ్రమైన కోల్డ్ రూమ్, నూనె ప్యాకెట్ల లీకేజీ, పురుగుల నియంత్రణలో లోపాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం–2006 కింద ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పు కలిగించే విధంగా నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
అమెజాన్, బిగ్‌బాస్కెట్ డార్క్ స్టోర్ల లైసెన్సులు రద్దు
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 21, 2026, 09:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)