సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సామాన్యుడిపై మరో భారం .. భారీగా పెరుగనున్న ధరలు

5 గంటల క్రితం

Another burden on the common man... prices set to rise sharply
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 09:02 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఇప్పటికే బియ్యం, పప్పులు, ఎల్పీజీ గ్యాస్, పెట్రోల్ ధరల పెంపుతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్య ప్రజలపై మరో భారం పడనుంది. త్వరలోనే రోజువారీ వినియోగ ఉత్పత్తులైన సబ్బులు, టూత్‌పేస్ట్‌లు, వంటనూనెలు, చాక్లెట్ల ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. సరుకుల సరఫరా, ఉత్పత్తి వ్యయం పెరగడంతో ఈ నిత్యావసర వస్తువుల ధరలను పెంచేందుకు పలు ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.


పెరుగుతున్న అంతర్జాతీయ ముడిచమురు, వర్షాభావ ప్రభావం : ఎఫ్‌ఎంసీజీ కంపెనీల నిర్ణయం

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 113 డాలర్లకు చేరడంతో ఉత్పత్తుల తయారీ, రవాణా వ్యయాలు గణనీయంగా పెరిగాయి. దీనితోపాటుగా ముడిసరుకుల ధరలు 74 శాతం వరకు పెరగడం, తక్కువ వర్షపాతం నమోదు కావడంతో పంట దిగుబడులు తగ్గడం వ్యాపారాల నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపాయి. క్రైసిల్, ఎలరా క్యాపిటల్, కొటక్ నియో వంటి ఆర్థిక విశ్లేషణ సంస్థలు కంపెనీల ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో ఈ భారాలు వినియోగదారులపై పడక తప్పదని స్పష్టం చేశాయి.


పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ఛార్జీలు.. టెలికాం రంగంలోనూ పెంపు అంచనా ...

కేవలం ఎఫ్‌ఎంసీజీ వస్తువులే కాకుండా టెలికాం రంగంలో కూడా ధరల పెంపు సూచనలు కనిపిస్తున్నాయి. అంబిత్ క్యాపిటల్ నివేదిక ప్రకారం, రాబోయే డిసెంబర్ నాటికి ప్రముఖ టెలికాం సంస్థలు మొబైల్ రీఛార్జ్, టెలిఫోన్ బిల్లులను పెంచే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు నిత్యావసర వస్తువులు, మరోవైపు రవాణా, కమ్యూనికేషన్ ఛార్జీలు ఒకేసారి పెరగనుండటం మధ్యతరగతి, పేద ప్రజల జేబులకు మరింత చిల్లు పెట్టనుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్