గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకొల్‌‌కతాలో జూనియర్‌ డాక్టర్లపై ఎబివిపి గూండాల దాడి

3 గంటల క్రితం

కొల్‌‌కతాలో జూనియర్‌ డాక్టర్లపై 
ఎబివిపి గూండాల దాడి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 11:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కొల్‌‌కతా : పశ్చిమ బెంగాల్‌ ‌రాజధాని కొల్‌‌కతాలో జూనియర్‌ ‌డాక్టర్లపై ఎబివిపి గూండాలు దాడికి పాల్పడ్డారు. ప్రతిష్టాత్మక కొల్‌‌కతా మెడికల్‌ ‌కాలేజ్‌‌లో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో పలువురు జూనియర్‌ ‌డాక్టర్లు గాయపడ్డారని పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ (డబ్ల్యూబిజెడిఎఫ్‌) ‌తెలిపింది. బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో బయట నుంచి దూసుకొచ్చిన దాదాపు 80 మందికి పైగా ఎబివిపి దుండగులు ఆసుపత్రిలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించారని, ఇంటర్న్‌లు, డాక్టర్లపై దాడి చేశారని, ఈ దాడిలో అనేక మంది శారీరకంగా గాయపడ్డారని డబ్ల్యూబిజెడిఎఫ్‌ గురువారం తెలిపంద. ఈ దాడికి సంబంధించిన వీడియోను తమ సోషల్ మీడియా పేజీల్లో షేర్‌ ‌చేసింది. ఈ దాడి గురించి పోలీసులకు తక్షణమే సమచారం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించింది. కొన్ని రోజులు క్రితం దుర్గాపూజ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన విషయంలో బెంగాల్‌‌లోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఎనిమిదిమంది జూనియర్ డాక్టర్లకు షో-కాజ్ నోటీసు జారీ చేశారు. దీనికి వ్యతిరేకంగా కొల్‌‌కతా వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. బుధవారం ప్రిన్సిపాల్‌‌ను కొన్ని గంటల పాటు ఘెరావ్‌ ‌చేశారు. ఈ నేపథ్యంలో బయటి నుంచి వచ్చిన ఎబివిపి గూండాలు జూనియర్‌ ‌డాక్టర్లపై దాడికి తెగబడ్డారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్