- సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే
న్యూఢిల్లీ: సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలను భగ్నం చేసి, హింసాత్మకంగా మార్చేందుకు బిజెపి ఉద్దేశపూర్వకంగా బయటి వ్యక్తులను పంపిస్తోందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే విమర్శించారు. గురువారం ఉదయం దీప్కే మీడియాతో మాట్లాడుతూ "మేము నెల రోజులుగా జంతర్‌మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం. ఈ కాలంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగలేదు. కానీ ఉద్యమానికి ప్రజల మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో నిరసనను భగ్నం చేయడానికి బిజెపి బయటి నుంచి గూండాలను పంపిస్తోంది. రాళ్లు విసురుతున్నవారు బిజెపికి చెందినవారే. పోలీసులు ట్రక్కుల్లో రాళ్లను తీసుకొచ్చి, బిజెపి గూండాలు వాటిని విసిరిన తర్వాత సీజేపీ కార్యకర్తలపైనే నిందలు మోపుతున్నారు" అని అన్నారు.
ఇదిలా ఉండగా, సీజేపీకి మద్దతుగా ముంబైలో నిర్వహించిన నిరసనలకు సంబంధించి ముంబై పోలీసులు 13 కేసులు నమోదు చేశారు. చట్టవిరుద్ధంగా గుమికూడడం, నిషేధాజ్ఞలను ఉల్లంఘించడం తదితర ఆరోపణలపై జూలై 18 నుంచి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుల్లో సుమారు 400 మందిని నిందితులుగా చేర్చారు.







కామెంట్‌లు (0)