గురువారం, 23 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మోడీ ప్రకటనను తిరస్కరించిన సీజేపీ

2 గంటల క్రితం

pm modi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 23, 2026, 09:20 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే

న్యూఢిల్లీ: ప్రశ్నపత్రాల లీకేజీ కేసుల విచారణ కోసం ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటనను సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) తిరస్కరించింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న తమ డిమాండ్‌ను సీజేపీ మరోసారి స్పష్టం చేసింది. ప్రధాని మోడీ 'ఎక్స్' వేదికగా పేపర్ లీక్‌లకు పాల్పడిన వారికి వేగవంతమైన విచారణలు, కఠిన శిక్షలు అమలు చేసేందుకు ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన వెంటనే, సీజేపీ అదే వేదికపై స్పందించింది. "ధర్మేంద్ర ప్రధాన్ తప్పనిసరిగా రాజీనామా చేయాలి" అని పేర్కొంది. ఫాస్ట్-ట్రాక్ కోర్టుల ఏర్పాటు మాత్రమే సరిపోదని, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై రాజకీయ బాధ్యతను విద్యాశాఖ మంత్రి వహించాలని సీజేపీ అభిప్రాయపడింది. ప్రభుత్వ తాజా ప్రకటనతో తమ డిమాండ్లు నెరవేరలేదని స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా, నీట్ పేపర్ లీక్ వివాదంపై తొలిసారిగా స్పందించిన ప్రధాని మోడీ, విద్యార్థుల భవిష్యత్తును పరిరక్షించడమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని పేర్కొన్నారు. "మన యువత సంక్షేమం, భవిష్యత్తు కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. పేపర్ లీక్‌లకు పాల్పడిన వారికి వేగవంతమైన, కఠినమైన శిక్షలు పడేలా ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం. యువత భవిష్యత్తుతో చెలగాటమాడే వారిని వదిలిపెట్టబోము" అని ప్రధాని మోడీ 'ఎక్స్'లో పేర్కొన్నారు.



సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్