బిలాస్పుర్ (హిమాచల్ ప్రదేశ్) : పెళ్లైన నాలుగు రోజులకే ఓ నవ వధువు రూ.18 లక్షల విలువ చేసే నగలు, నగదుతో అత్తారింటి నుంచి పరారైన ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్‌పుర్ జిల్లాలోని భరారీ ప్రాంతంలో జరిగింది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ... ఈ ఘటన వరుడి కుటుంబ సభ్యులను దిగ్భ్రాంతికి గురిచేయడం మాత్రమే కాకుండా.. ఆ ప్రాంతంలో తీవ్ర చర్చకు దారి తీసిందని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు.. యమునా నగర్‌కు చెందిన మహిళ (22) ను అక్టోబరు 31న హర్యానాలోని జగాధ్రీ సివిల్ కోర్టులో వరుడు వివాహం చేసుకున్నాడు. అనంతరం అత్తారింటికి వచ్చిన వధువు నాలుగు రోజులకే రూ.18 లక్షల విలువ చేసే నగలు, నగదుతో ఉడాయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, నిందితురాలి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.
అత్తారింటి నగలు, నగదుతో పెళ్లి కూతురు పరార్
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 10, 2026, 10:17 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)