విద్యుత్ స్తంభాన్ని ఢీకొని డివైడర్ దాటి బోల్తా పడిన కారు
ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పానిపట్–ఖతిమా జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున విద్యుత్ స్తంభాన్ని ఢీకొని డివైడర్ దాటి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు సజీవ దహనమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 4.50 గంటల సమయంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అనంతరం సుమారు 10 మీటర్ల మేర డివైడర్‌ను దాటి అవతలి రోడ్డుపై బోల్తాపడింది. దీంతో కారులో మంటలు చెలరేగి ఆరుగురూ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న తితావి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.







కామెంట్‌లు (0)