శనివారం, 25 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యార్థి యువజనులకు అభినందనలు

4 గంటల క్రితం

cpm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 25, 2026, 09:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- సిపిఎం పొలిట్​బ్యూరో

న్యూఢిల్లీ : జవాబుదారీతనం కోసం పోరాడి గెలిచిన విద్యార్థులకు,యువతకు భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్) పొలిట్‌‌బ్యూరో అభినందనలు తెలిపింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. పేపర్ లీక్‌ల కారణంగా 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న దురదృష్టకర సంఘటనలపై జవాబుదారీతనం కోసం పోరాడిన దేశంలోని విద్యార్థులు, యువతకు అభినందనలు తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సాగిన లాఠీచార్జీలు, ఇతర అణచివేత చర్యలను ఎదుర్కొని కూడా వెనక్కి తగ్గకుండా, దేశ యువత ప్రదర్శించిన స్థిరమైన సంకల్పం, త్యాగాలు లేకపోతే ఈ విజయం సాధ్యమయ్యేది కాదు. యువత చూపిన ధైర్యం, దృఢ సంకల్పం భారత ప్రజాస్వామ్యానికి శుభసూచకం అని పొలిట్‌‌బ్యూరో పేర్కొంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను సిపిఎం స్వాగతించింది. అయితే దీని తర్వాత కూడా పేపర్‌ ‌లీక్‌ అయ్యే అవకాశముందని, దీనికి ప్రధానంగా బాధ్యత వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేసింది. పరీక్షల వికేంద్రీకరణ చేయాలని సిపిఎం ప్రకటనలో పునరుద్ఘాటించింది. అలాగే, వాణిజ్యీకరణ, కేంద్రీకరణ, మతతత్వం ప్రధానంగా ఉన్న జాతీయ విద్యా విధానం-2020ని కూడా రద్దు చేయాలి. ఈ చర్యలు తీసుకోకపోతే, పేపర్ లీక్‌లు, వంచనల పరంపర కొనసాగుతుందని తెలిపింది. విద్యార్థి, యువజన ఉద్యమాలు తమ భవిష్యత్తు కోసం ఈ ప్రధానమైన డిమాండ్లను ప్రచారం చేసి, ఆందోళన చేస్తారని ఆశిస్తున్నామని సిపిఎం తెలిపింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్