- క్యాంపస్‌కు వెళ్లి సంఘీభావం తెలిపిన ఎంఎ బేబీ, వి. శివదాసన్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) విద్యార్థి సంఘం నేతలు చేస్తున్న నిరాహార దీక్షకు సిపిఎం సంఘీభావం ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ, రాజ్యసభ సభ్యుడు వి. శివదాసన్ బుధవారం క్యాంపస్‌కు వెళ్లి దీక్షలో ఉన్న విద్యార్థులను కలిసి మద్ధతు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఎ బేబీ మాట్లాడుతూ బిజెపి, ఆర్ఎస్ఎస్లు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలపై దాడులు చేస్తున్నాయన్నారు. అయితే, సమస్యలపై జెఎన్‌యు విద్యార్థుల దీక్షలు చేస్తున్నా యాజమాన్యం స్పందికపోవడం సరికాదని ఎంఎ బేబీ అన్నారు. వారి నిరసనకు మద్ధతును సంఘీభావాన్ని ప్రకటించారు. గత పది రోజులుగా జెఎన్‌యు విద్యార్థి సంఘం (జెఎన్యూఎస్యు) ముగ్గురు ఆఫీస్ బేరర్లు, మరో తొమ్మిది మంది విద్యార్థులు దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షలో జెఎన్యూఎస్యు అధ్యక్షురాలు అదితి మిశ్రా, ఉపాధ్యక్షురాలు గోపిక బాబు, ప్రధాన కార్యదర్శి సునీల్ యాదవ్, మరో తొమ్మిది మంది విద్యార్థులు నిరాహార దీక్షలో ఉన్నారు. విద్యార్థి సంఘం ఆఫీస్ బేరర్ల బహిష్కరణ (రస్టికేషన్) రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే, అంతర్గత ప్రవేశ పరీక్షల విధానాన్ని తిరిగి ప్రారంభించాలని, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పనిచేసే జెండర్ సెన్సిటైజేషన్ కమిటీ పునరుద్ధరించాలని, క్యాంపస్‌లో శిథిలావస్థకు చేరిన మౌలిక సదుపాయాల మరమ్మతులు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.








కామెంట్లు (0)