mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి నేతల క్రాస్ ఓటింగ్ : భగ్గుమన్న బిజెపి

1 గంట క్రితం

Karnataka BJP Mlas
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 19, 2026, 04:41 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

బెంగళూరు : ప్రస్తుతం కర్ణాటక ఎన్డిఎలో చీలికలొచ్చాయి. కాంగ్రెస్ అంటేనే భగ్గుమనే బిజెపి నేతలు.. కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డిఎ భాగస్వామ్యపార్టీలు బిజెపి, జెడిఎస్ పార్టీలకు చెందిన 11 మంది ఆ పార్టీకే ఓటు వేశారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఘన విజయం దక్కింది. బిజెపి భగ్గుమంది. క్రాస్ ఓటింగ్ పాల్పడిన నేతలను క్షమించేది లేదని స్పష్టం చేసింది.

కాగా, గురువారం ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగ్గా వాటిల్లో ఐదు స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. అయితే కాంగ్రెస్ కి ఇంతటి ఘన విజయం దక్కడానికి ప్రధాన కారణం ఆరుగు బిజెపి శాసనసభ్యులు, ఎనిమిది మందిలో నలుగురు జెడి(ఎస్) శాసనసభ్యులు వేసిన క్రాస్ ఓటింగ్ వల్లేనని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 5 (తిప్పన్నప్ప కమక్నూర్, పివి మోహన్, బీకే హరిప్రసాద్, శివన్న బిఎస్, వినయ్ కార్తీక్ ప్రకాష్), బిజెపి (లింగరాజ్ పాటిల్, రఘు ఆర్) రెండు స్థానాల్ని గెలుచుకోంది. దీంతో శాసనసమండలిలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ లభించింది.

బిజెపి మద్దతుపై బరిలో నిలిచిన అభ్యర్థి గోవిందరాజు ఓడిపోయారు. 18 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నందున కచ్చితంగా గెలుస్తారనే భావించారు. అయితే బిజెపి ఓట్లు మాత్రమే కాకుండా.. జెడిఎస్ పార్టీ నుంచి ఆయనకు ఓట్లు వేయలేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లు ఆయనకు 14 మాత్రమే లభించాయి. అంటే జెడిఎస్ కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు స్పష్టమవుతోంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పై బిజెపి అధిష్టానం సీరియస్ అయింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కర్ణాటక బిజెపి చీఫ్ బివై విజయేంద్రతో మాట్లాడారు. క్రాస్ ఓటింగ్ పాల్పడింది నిజమేనని విజయేంద్ర అంగీకరించారు. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'మా పార్టీలో క్రాస్ ఓటింగ్ చేసిన ఎమ్మెల్యేలను క్షమించే ప్రసక్తే లేదు. వారిని క్షమించబోము. ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఉందనే దానిపై మా దగ్గర కొంత సమాచారం కూడా ఉంది` అని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక బిజెపి అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర, ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక, రాష్ట్ర ఇన్‌చార్జి రాధామోహన్ దాస్ అగర్వాల్‌లను జూన్ 23న ఢిల్లీకి పిలిపించినట్లు శుక్రవారం పార్టీ ర్గాలు తెలిపాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్