న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం కేవలం ఓట్లనే కాకుండా ప్రజల పొదుపు నగదును కూడా దోచుకుందని కాంగ్రెస్ మండిపడింది. అచ్చేదిన్ అంటూ హామీ ఇచ్చిన అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఓట్లతో పాటు ప్రజల పొదుపులను దోచుకుంటుందని కాంగ్రెస్ కమ్యూనికేషన్ ప్రతినిధి జైరాం రమేష్ పేర్కొన్నారు. ప్రధాని తన సంచి (జోలె) తీసుకుని వెళ్లే సమయం ఆసన్నమైందని ఎద్దేవా చేశారు. ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉందని, ఓట్ల చోరీపై ప్రజల్లో ఆగ్రహం తీవ్రమవుతున్నా ప్రధాని మాత్రం మౌని బాబాలా ఉండిపోయారని పేర్కొన్నారు. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం గత నెల 5.97శాతం నుండి ఉండగా, సెప్టెంబర్‌లో 7.74శాతానికి పెరిగినట్లు నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఒ) గణాంకాలు వెల్లడించాయి. ఓట్ల చోరీ, నడ్డివిరుస్తున్న ద్రవ్యోల్బణం రెండూ వాస్తవాలేనని అన్నారు. ఆహార ద్రవ్యోల్బణం 7.74శాతానికి చేరిందని అంటే సుమారు ప్రతి ఆహార పదార్థపు ధర అత్యధిక స్థాయికి చేరిందని అన్నారు. ఉదాహరణకు, ఉల్లిపాయల ధరలు 108%, వెల్లుల్లి 55%, అల్లం 63%, మరియు నిమ్మకాయల ధరలు 36% పెరిగాయని జైరాం రమేష్ పేర్కొన్నారు.
ఓట్లతో పాటు ప్రజల పొదుపులను దోచుకుంటున్న మోడీ ప్రభుత్వం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 13, 2026, 11:38 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)