తమిళనాడు : దీపావళి పండుగ సమీపిస్తోన్న వేళ .... తమ స్వస్థలాలకు వెళ్లే వారి కోసం రైళ్లకు ఆదివారం బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున బుకింగ్ కోసం రైల్వే స్టేషన్ల వద్ద భారీగా జనం గుమిగూడారు. ఉదయం 8 గంటలకు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన 5 నిమిషాల్లోనే టిక్కెట్లన్నీ అమ్ముడయ్యాయి. కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌లోని 2 వ తరగతి స్లీపర్ కంపార్ట్‌మెంట్ కోసం వెయిటింగ్ లిస్ట్‌లో 33 మంది ఉన్నారు. ఎసి క్లాసులలో పరిమిత సంఖ్యలో సీట్లు ఉన్నాయి. గురువాయూర్ రైలు టిక్కెట్లన్నీ అమ్ముడయ్యాయి. తూత్తుకుడి ఎక్స్‌ప్రెస్ వెయిటింగ్ లిస్ట్ కూడా క్లియర్ చేయబడింది. అనంతపురి, నెల్లై, పుదుచ్చేరి వెళ్లే రైళ్లలో కూడా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాయి. నెల్లై, నాగర్‌కోయిల్‌కు వెళ్లే వందే భారత్ రైళ్ల బుకింగ్‌లు కూడా ముగిశాయి. పర్యాటకులకు అత్యంత రద్దీగా ఉండే రోజులు దీపావళి. ఈ క్రమంలో దీపావళి టిక్కెట్‌లను మొబైల్ ఫోన్‌లో కూడా అధిక సంఖ్యలో బుకింగ్ చేసుకోవటం తో 5 నిమిషాల్లో హాట్ కేక్ లా అమ్ముడైపోయాయి. నవంబర్ 6వ తేదీ వెళ్లే వారు సోమవారం బుక్ చేసుకోవాలని, నవంబర్ 7 వ తేదీకి బుకింగ్‌లు మరుసటి రోజు ప్రారంభమవుతాయని రైల్వే అధికారులు వెల్లడించారు.
దీపావళి ఎఫెక్ట్ - 5 నిముషాల్లో అమ్ముడైన రైలు టిక్కెట్లు
4 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 11:33 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)