శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇ ఎం రాధ మృతి సిపిఎంకు తీరని లోటు

4 రోజుల క్రితం

ma baby
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 11:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ నివాళి

న్యూఢిల్లీ : ఆదివారం కన్ను మూసిన ఇ.ఎం.రాధ మృతితో సిపిఎంకు, మొత్తంగా వామపక్ష ఉద్యమానికి, విస్తృత ప్రగతిశీల సమాజానికి తీరని లోటని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోషల్‌‌ మీడియాలో ట్వీట్‌ ‌చేశారు. ధృఢమైన రాజకీయ విశ్వాసాలు కలిగిన నిబద్ధత కలిగిన కామ్రేడ్‌గా ఆమె అత్యంత నిబద్ధతతో, అంకిత భావం, నిజాయితీలతో అనేక సంవత్సరాల పాటు పార్టీకి సేవలందించారని ఆయన పేర్కొన్నారు. దేశాభిమానితో గల సుదీర్ఘ అనుబంధం, ప్రజా జీవితంలో చురుకుగా పాల్గొనడం ద్వారా కేరళ రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలకు ఆమె ఎనలేని సేవలందించారని పేర్కొన్నారు. కేరళం రాష్ట్ర మహిళా కమిషన్‌ ‌సభ్యురాలిగా, రాష్ట్ర వృద్ధుల కమిషన్‌ ‌సభ్యురాలిగా ఆమె మహిళల, వృద్ధుల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం పాటుపడ్డారని బేబీ పేర్కొన్నారు. ‘ఇఎంఎస్‌ కుమార్తెగా జ్ఞాపకాలు’ అన్న పేరుతో తండ్రిపై ఆమె రాసిన పుస్తకం జీవితంపై, కామ్రేడ్‌ ఇఎంఎస్‌ ‌వారసత్వంపై ఆమెకు గల లోతైన గల వ్యక్తిగత దృక్పథాలను అందచేసింది. ఆమె నిరాడంబరత, రాజకీయ స్పష్టత, ప్రగతిశీల విలువల పట్ల ఆమెకు గల నిబద్ధత అత్యంత గౌరవంతో ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. ఈ సందర్భంగా రాధ భర్తకు, కుమారుడికి, ఇతర కుటుంబ సభ్యులకు, పార్టీ కార్యకర్తలకు సంతాపం, సానుభూతి తెలియచేశారు.

ఇ ఎం రాధకు అరుణాంజలి ! అని బేబీ ఆ పోస్టులో పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్