న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని స్వరూప్ నగర్ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఢిల్లీలోని వాయువ్య ప్రాంతమైన స్వరూప్ నగర్ లో ఆదివారం ఉదయం ఒక గోడౌన్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు దాదాపు 15 అగ్నిమాపక యంత్రాలను ఘటనా స్థలానికి రప్పించారు. ఈ ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. ప్రాథమిక నివేదికల ప్రకారం ... భయాందోళనల మధ్య కొందరు స్థానికులు భవనాల పైనుంచి దూకడం వల్ల మరికొందరికి గాయాలైనట్లు సమాచారం. మంటలు చెలగడానికి అసలు కారణం ఏమిటి అనే కోణంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది విచారణ జరుపుతున్నారు.
ఢిల్లీలో అగ్ని ప్రమాదం - ఇద్దరు మృతి
18 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 01:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)