ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఉజ్జయినిలో దారుణం

1 గంట క్రితం

ఉజ్జయినిలో దారుణం
- హోటల్‌లో విషవాయువుల తీవ్రతకు నలుగురు పారిశుధ్య కార్మికులు మృతి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 11:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • హోటల్‌లో విషవాయువుల తీవ్రతకు నలుగురు పారిశుధ్య కార్మికులు మృతి

ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హోటల్‌లో వ్యర్థాలు వేసే భూగర్భ గదిని శుభ్రం చేసేందుకు వెళ్లిన నలుగురు పారిశుధ్య కార్మికులు విషవాయువు పీల్చి ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు వారిని కాపాడేందుకు ప్రయత్నించి తీవ్ర స్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన శనివారం రాత్రి దేవాస్ రోడ్డులోని శ్రీ గంగా హోటల్‌లో జరిగింది. రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో హోటల్ మిఠాయిలు, పాల ఉత్పత్తుల విభాగాల నుంచి వచ్చే మిగిలిపోయిన ఆహారం, ఇతర వ్యర్థాలను వేసే గదిలో శుభ్రత పనులు చేపట్టారు. ఈ క్రమంలో కొందరు సిబ్బంది లోపలికి వెళ్లగా విషవాయువు ప్రభావంతో కుప్పకూలిపోయారు. వారిని రక్షించేందుకు వెళ్లిన ఇతరులు కూడా అస్వస్థతకు గురయ్యారు. మృతులను ఉజ్జయినికి చెందిన కమలేశ్, నితిన్, వహీద్, రాజస్థాన్‌లోని ఝాలావర్‌కు చెందిన మనోజ్ మీనాగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు, అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. విద్యుత్ కట్టర్‌తో గదిలోని కొంత భాగాన్ని తొలగించి బాధితులను బయటకు తీశారు. పోలీసులు వెంటనే సీపీఆర్ చేసినప్పటికీ నలుగురినీ కాపాడలేకపోయారు. గ్యాస్ లీకేజీ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ఉజ్జయిని ఎస్పీ ప్రదీప్ శర్మ తెలిపారు. బాధితులను రక్షించేందుకు వెళ్లిన మరికొందరిని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్