సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

“మాకు న్యాయం చేయండి లేదా చంపండి” : నిరాశ్రయుల జల సత్యాగ్రహం

1 గంట క్రితం

“Give us justice or kill us”: Homeless people’s Jal Satyagraha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 10:42 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

పన్నా (మధ్యప్రదేశ్) : కెన్-బెత్వా లింక్ ప్రాజెక్ట్, మజ్‌గవాన్ డ్యామ్, రంజ్ డ్యామ్, సింగ్రౌలి-లలిత్‌పూర్ రైల్వే లైన్ నిర్మాణం కారణంగా మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలోని అజయ్‌ఘర్ ప్రాంతంలో వందలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ఈ ప్రాజెక్టుల కారణంగా నీటిమట్టాలు పెరగడంతో అనేక గ్రామాలు నీట మునిగాయి. ఇక్కడి ప్రజలు న్యాయం కోరుతూ ... నీటిలో చెక్క కట్టడాలపై పడుకొని జలసత్యాగ్రహం చేస్తున్నారు. ఆదివారంతో వీరి జలసత్యాగ్రహం తొమ్మిదో రోజుకు చేరింది. తమకు తగిన నష్టపరిహారం అందించి, పునరావాసం కల్పించాలంటూ వారు కొన్ని నెలలుగా డిమాండ్‌ చేస్తున్నారు. పలువురు ఆందోళనకారులు నీటిలో చితులు పేర్చుకుని వాటిపై శవాల్లా పడుకుని, మరికొందరు ఉరి బిగించుకుని నిరసన తెలిపారు.


ఆందోళనపై అణచివేత .. కరెంటు కోత ..!

ఆందోళనను అణచివేసేందుకు అధికారులు ఆ ప్రాంతంలో విద్యుత్ సౌకర్యాన్ని నిలిపివేశారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రభుత్వ వాదనలు, హామీలు, గణాంకాలపై ప్రశ్నలు తలెత్తాయి. అజయ్‌గఢ్ ముంపు ప్రాంతంలో 'చితి నిరసన' మండే ఎండ, నీటిలోని అలల మధ్య, గిరిజన మహిళలు, పిల్లలు, వృద్ధులు నీటిలో ఉంచిన కట్టెల చితులపై పడుకుని ఉన్నారు. పలువురు స్త్రీ పురుషులు తమ మెడలకు ఉరితాళ్లను ధరించి, “మాకు న్యాయం చేయండి లేదా మమ్మల్ని చంపండి” అనే నినాదాలు చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్