ముంబయి : ఎయిరిండియాకు చెందిన ఓ విమానం నుంచి హైజాక్ అలర్ట్ రావడం తీవ్ర కలకలం రేపింది. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబయికు వెళ్లాల్సి ఉన్న ఎయిరిండియా విమానం టేకాఫ్ కావడానికి సరిగ్గా కొన్ని నిమిషాల ముందు విమానం పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి ‘హైజాక్ అలెర్ట్’ పంపించారు. విమాన టాయిలెట్‌లో ఓ అద్దంపై హైజాక్‌ను సూచిస్తూ బెదిరింపు సందేశం కన్పించినట్లు సమాచారం. దీంతో పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు హైజాక్ అలర్ట్ ఇచ్చారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు విమానాన్ని వెంటనే ఎయిర్‌పోర్టులోని ఐసోలేషన్ బే కు తరలించాయి. ప్రయాణికులందరినీ విమానం నుంచి కిందకు దించి, ప్రామాణిక నిబంధనల ప్రకారం ... విమానంలో సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది ముమ్మర తనిఖీలు చేపట్టారు. విమానంలో బెదిరింపు నోట్ లభించడం, సాంకేతిక కారణాల వల్ల హెచ్చరిక సందేశం వెళ్లిందా అనే కోణంలో పోలీసులు, సెక్యూరిటీ ఏజెన్సీలు దర్యాప్తు చేపట్టాయి.
ఎయిరిండియా విమానం నుండి హైజాక్ అలర్ట్ ..!
5 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 11, 2026, 12:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)