మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

లాభాల్లో ఎపిహెచ్ఐఎంఎల్

1 గంట క్రితం

APHIML in profit
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 11:23 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • మూడేళ్లలో రూ.34.20 కోట్ల ఆదాయం

ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : తీవ్ర నష్టాల్లో కూరుకు పోయిన ఎపి హెవీ మెషినరీ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (ఎపిహెచ్ఎంఇఎల్) లాభాల బాటలో దూసుకుపోతోంది. 30 ఏండ్లుఏళ్లుగా ఇబ్బందుల్లో ఉన్న ఎపిహెచ్ఎంఇఎల్ సింగరేణి అనుబంధ సంస్థగా మారిన తర్వాత ఆర్థిక పనితీరు గణనీయంగా మెరుగుపడింది. రూ.21 కోట్ల నష్టాల నుంచి రూ.60.85 కోట్ల లాభాలకు చేరుకుంది. సింగరేణితోపాటు ఇతర భారీ పరిశ్రమలకు యంత్రాలు, వాటి విడిభాగాలను తయారు చేసి సరఫరా చేస్తున్న ఎపిహెచ్ఎంఇఎల్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.23.33 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.కొత్త ఊపిరి పోసిన సింగరేణిఎపిహెచ్ఎంఇఎల్ సంక్షోభంలో ఉన్న సమయంలో ఆదుకునేందుకు సింగరేణి ముందుకొచ్చింది. 1994 నుంచి సింగరేణికి అవసరమైన కొన్ని యంత్రాలు, విడిభాగాలను ఆ సంస్థ ఎపిహెచ్ఎంఇఎల్ నుంచి కొనుగోలు చేస్తుంది. భూగర్భ గనుల్లో కార్మికుల రవాణాకు ఉపయోగించే మ్యాన్ రైడింగ్ సిస్టమ్స్, భారీ షావెల్స్క అవసరమైన బకెట్లు, రూఫ్ బోల్టింగ్ రాడ్లు తదితర ఉత్పత్తులకు ఆర్డర్లు ఇచ్చి నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు సింగరేణి ముందుకొచ్చింది. 1997-98లో రూ.9.18 కోట్ల ఈక్విటీ పెట్టుబడితో ప్రక్రియను ప్రారంభించింది. అనంతరం సింగరేణి మొత్తం రూ.14.08 కోట్ల పెట్టుబడితో 81.54 శాతం వాటాను కలిగి ప్రధాన భాగస్వామిగా మారింది. ప్రస్తుతం పబ్లిక్ షేర్ హోల్డర్లకు 11.81 శాతం, ఎపిఐడిసికి 5.79 శాతం వాటా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 0.86 శాతం వాటా కలిగి ఉంది.

300 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ ఎపిహెచ్ఎంఇఎల్ను మరింత లాభదాయకంగా మార్చేందుకు వ్యయ నియంత్రణపైనా ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్లాంట్ ప్రాంగణంలో ఎపిహెచ్ఎంఇఎల్ సింగరేణి అండగా నిలిచింది. అయితే కేవలం ఆర్డర్లు ఇవ్వడం ద్వారా సంస్థను పూర్తిస్థాయిలో గట్టెక్కించడం సాధ్యం కాకపోవడంతో ఎపిహెచ్ఎంఇఎల్లోపెట్టుబడులుపెట్టి

300 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఎపిహెచ్ఎంఇఎల్ ప్రస్తుతం తన ప్లాంట్ విద్యుత్ అవసరాలకు ఏటా సుమారు రూ.60 లక్షలు ఖర్చు చేస్తోంది. కొత్త సోలార్ ప్లాంట్తో విద్యుత్ వ్యయం గణనీయంగా తగ్గనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్