మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఐఐటి ముంబయి విద్యార్థి కేసులో డీన్ సూర్యనారాయణ తొలగింపు

1 గంట క్రితం

Dean Suryanarayana removed in IIT Bombay student case.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 11:18 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఐఐటి బొంబై యాజమాన్యం దిగొచ్చింది. విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన డీన్ (పరిపాలనా వ్యవహారాలు) ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్ళను ఆ పదవి నుంచి తొలగించారు. ప్రొఫెసర్ దూళ్ళను డీన్ పదవి నుంచి తక్షణమే తొలగించినట్లు సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ శిరీష్ కేదారే సోమవారం వెల్లడించారు. “విచారణ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం” అని ఆయన తెలిపారు. ఐఐటి బొంబైలో ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో బిటెక్ రెండవ సంవత్సరం చదువుతున్న సాహిల్ రవీంద్ర వకోడే (22) ఈ నెల 18న ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సంస్థాగత వేధింపులు, కుల వివక్ష కారణంగానే రవీంద్ర ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. అలాగే, ఈ ఘటనతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలోనే డీన్ పదవి నుంచి సూర్యనారాయణను యాజమాన్యం తొలగించింది. కాగా, విద్యార్థి ఆత్మహత్య ఘటనపై ముంబయి పోలీసులు శనివారమే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును ముంబయి క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోందని పోలీసు అధికారులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్