శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హెలికాఫ్టర్లు ఢీకొని భారతీయుడు మృతి..

3 రోజుల క్రితం

nepal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026, 11:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

• నేపాల్‌లో ల్యాండ్‌ అవుతుండగా ప్రమాదం

ఖాట్మాండు : నేపాల్‌లో ల్యాండ్ అవుతుండగా రెండు హెలికాప్టర్లు ఢీకొనడంతో భారతీయుడు ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. నేపాల్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... సోలుఖుంబు జిల్లాలో ఫిష్‌టెయిల్ ఎయిర్, ఎయిర్ డైనస్టీకి చెందిన రెండు హెలికాప్టర్లు మంగళవారం ల్యాండ్‌ అవుతుండగా ఢీకొన్నాయి. పోలీస్ ఇన్‌స్పెక్టర్ మౌసమ్ తమాంగ్ తెలిపిన వివరాల ప్రకారం, ఫిష్‌ ట్రైల్‌ ఎయిర్‌ హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న భారత్‌కు చెందిన వసంత్ కుమార్ బలరామరాముడు మరణించినట్లు గుర్తించారు. అదే హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న, న్యూజిలాండ్‌లో నివసిస్తున్న భారతీయ మూలాలున్న శైలేష్ కృష్ణ పటేల్ (49) గాయపడ్డారు. ఆయనను 'ప్రభు హెలికాప్టర్' ద్వారా ఖాట్మండులోని మెడిసిటీ ఆసుపత్రికి తరలించినట్లు తమాంగ్ తెలిపారు. ఈ ఘటనలో రెండు హెలికాప్టర్ల పైలెట్లు రవీంద్ర ప్రజాపతి, ప్రజ్వల్ కె.సి. గాయపడ్డారు. వారిని మెరుగైన చికిత్స కోసం ఖాట్మండు తరలించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్