బుధవారం, 11 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సోనియాగాంధీ పుస్తకంపై జెడి(యు) విమర్శలు

5 గంటల క్రితం

sonia, nitish
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 12:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పాట్నా : కాంగ్రెస్‌ అధ్యక్ష‍ురాలు సోనియాగాంధీ జ్ఞాపకాల సమాహారం ‘బిలాంగింగ్‌ : ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’లో జనతాదళ్‌ (యునైటెడ్‌) బుధవారం విమర్శలు గుప్పించింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను చిత్రీకరించిన తీరుపై పార్టీ విమర్శించింది. ఇండియా బ్లాక్‌కి ఆయనే రూపకర్త అని, ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించారని జెడి(యు) పేర్కొంది. ఇండియా బ్లాక్‌ ఏర్పాటుకు సంబంధించిన పరిణామాలను తన పుస్తకంలో సోనియాగాంధీ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వివరించారని జెడి(యు) జాతీయ ప్రతినిధి రాజీవ్‌ రంజన్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్న 'ఇండియా బ్లాక్' వెనుక నితీష్ కుమారే సూత్రధారి, చోదక శక్తి అని తాము విశ్వసిస్తున్నామని అన్నారు. సోనియా తన ఆత్మకథలో నితీష్‌ కుమార్ 'ఇండియా బ్లాక్'ను వీడటానికి అవకాశం కోసం ఎదురుచూశారని, బిజెపి ప్రభావంలో ఉన్నారని పేర్కొన్నారు. 2024 ప్రారంభంలో ఆయన ఎన్‌డిఎలోకి తిరిగి వెళ్లారని రాశారు. సోనియా గాంధీ వాదనను ఖండిస్తూ, కాంగ్రెస్‌ ఇండియాబ్లాక్‌లో చేరేందుకు చాలా ప్రాంతీయ పార్టీలు మొదట్లో విముఖత చూపాయని, అయితే నితీష్‌ కుమార్ వారిని ఒప్పించి ఆ పార్టీతో చేతులు కలిపారని రాజీవ్‌ రంజన్‌ ప్రసాద్ అన్నారు. నితీష్‌ కుమార్‌ కారణంగానే పాట్నాలో ఇండియా బ్లాక్‌ మొదటి సమావేశం విజయవంతమైందని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్