బుధవారం, 11 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వామపక్ష‍ాలకు తగిన గుర్తింపు ఇచ్చిన సోనియాగాంధీ : జాన్‌ బ్రిట్టాస్‌

2 గంటల క్రితం

John Brittas
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 04:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తిరువనంతపురం : యుపిఎ ఏర్పాటులో, ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంలో వామపక్ష పార్టీలు పోషించిన పాత్రకు సోనియాగాంధీ తన జ్ఞాపకాల పుస్తకంలో తగిన గుర్తింపు ఇచ్చారని సిపిఐ(ఎం) ఎంపి జాన్‌ బ్రిట్టాస్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలయన్స్‌ (యుపిఎ)కు మద్దతు తెలిపిన సమయంలో సిపిఐ(ఎం) అధికారాన్ని గానీ, ప్రభుత్వ పదవులను గానీ ఆశించలేదని, బిజెపిని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యంగా పనిచేసిందని ఆయన తెలిపారు. సోనియాగాంధీ రాసిన ‘బిలాంగింగ్‌ : ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ అనే పుస్తకంపై బుధవారం ఆయన స్పందించారు. యుపిఎ ఏర్పాటులో సిపిఐ(ఎం), ఇతర వామపక్ష పార్టీల పాత్రకు సోనియాగాంధీ తగిన గుప్తింపు ఇచ్చారని తాను భావిస్తున్నానని, కేరళలోని కాంగ్రెస్‌ నేతలు ఈ విషయాన్ని గుర్తించాలని జాన్‌ బ్రిట్టాస్‌ సూచించారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమికి వామపక్షాలు అందించిన సహకారాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వంలో భాగస్వాములు కాకూడదని నిర్ణయించుకున్నప్పటికీ, బిజెపి అధికారంలోకి రాకుండా అడ్డుకునే బాధ్యతను సిపిఐ(ఎం) నేతలు తమ భుజాన వేసుకున్నారని పేర్కొన్నారు. అధికారం, పదవులపై ఆశ లేకుండానే కాంగ్రెస్‌కు మద్దతు తెలిపామని స్పష్టం చేశారు. సోనియాగాంధీ జ్ఞాపకాల పుస్తకంపై బిజెపి చేస్తున్న విమర్శలను కూడా జాన్‌ బ్రిట్టాస్‌ తప్పుబట్టారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు పాల్పడిన కరసేవకులు, సంఘ్‌ పరివార్‌ బృందం తనను కూడా మోసం చేశాయని బిజెపి సీనియర్‌ నేత ఎల్‌.కె. అద్వానీ గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. ఆ ఇంటర్వ్యూను బిజెపి నేతలు మరోసారి పరిశీలించాలని సూచించారు. తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేసిన తర్వాత అద్వానీ పట్ల బిజెపి వ్యవహరించిన తీరును ఆయన ప్రశ్నించారు. కొంతమంది వ్యక్తులు, కొన్ని పరిణామాలపై తన అభిప్రాయాలను వెల్లడించినందుకే అద్వానీని నాయకత్వం నుంచి పక్కనపెట్టారా అని ప్రశ్నించారు. అందుకు కారణమేమిటని జాన్ బ్రిట్టాస్‌ బిజెపిని నిలదీశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్